చంపడం కాదు – గెలవడం ముఖ్యం : సైరా ట్రైలర్ 2

య్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం.. 'సైరా'.. నరసింహారెడ్డి'.. రెండవ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 26, 2019 / 05:14 AM IST
చంపడం కాదు – గెలవడం ముఖ్యం : సైరా ట్రైలర్ 2

Updated On : September 26, 2019 / 5:14 AM IST

య్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం.. ‘సైరా’.. నరసింహారెడ్డి’.. రెండవ ట్రైలర్ రిలీజ్..

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన ధీరుడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం.. ‘సైరా’.. నరసింహారెడ్డి’.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైరా విడుదలకు రంగం సిద్ధమైంది.

రీసెంట్‌గా ‘సైరా’ రెండవ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆంగ్లేయులు భారతదేశంపై దండెత్తడం, ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజల తరపున నరసింహారెడ్డి వారితో పోరాడడం వంటివి ట్రైలర్‌‌లో చూపించారు. సినిమాపై అంచనాలు పెంచేలా ఉందీ ట్రైలర్. రత్నవేలు విజువల్స్, అమిత్ త్రివేది ఆర్ఆర్ బాగున్నాయి.

Read Also : వరుణ్ తేజ్‌కు ‘జై బాలయ్య’ సెగ..

అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, కిచ్చా సుదీప్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి తదితరులు నటించిన ‘సైరా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో భారీగా విడుదల కానుంది.