Tabu : తల్లవ్వాలంటే పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకోకుండానే తల్లి అవ్వొచ్చు.. టబు వ్యాఖ్యలు..
తాజాగా టబు ఓ ప్రెస్ మీట్ లో తన పెళ్లి గురించి ప్రస్తావన వస్తే సంచలన వ్యాఖ్యలు చేసింది. టబు మాట్లాడుతూ.. ''నాకు కూడా తల్లి అవ్వాలని ఉంది. తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి కాకుండానే గర్భం దాల్చొచ్చు............

Tabu sensational Comments on Marriage and Childrens
Tabu : ఇటీవల కొంతమంది హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఎంత వయసు వచ్చినా పెళ్లి మాట ఎత్తట్లేదు. అందులో సీనియర్ హీరోయిన్ టబు ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్ గా పాపులర్ అయిన టబు ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తుంది. 50 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి కూడా పెళ్లి మాట ఎత్తట్లేదు. ఎవరైనా అడిగితే అవసరం ఏముంది అంటూ సమాధానం చెప్తుంది టబు.
BiggBoss 6: బిగ్‌బాస్ కంటెస్టెంట్ సుదీప(పింకీ) గురించి మీకు తెలుసా..
తాజాగా టబు ఓ ప్రెస్ మీట్ లో తన పెళ్లి గురించి ప్రస్తావన వస్తే సంచలన వ్యాఖ్యలు చేసింది. టబు మాట్లాడుతూ.. ”నాకు కూడా తల్లి అవ్వాలని ఉంది. తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి కాకుండానే గర్భం దాల్చొచ్చు. సరోగసి ద్వారా కూడా తల్లినయ్యే అవకాశం ఉంది. పెళ్ళి కాకపోతే చచ్చిపోం, తల్లి కాకపోయినా చచ్చిపోం, ప్రస్తుతం కెరీర్‌ని, యాక్టింగ్ ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను. పెళ్ళికి, పిల్లలకి వయసుతో సంబంధం లేదు. అయినా ఈ రోజుల్లో దేనికి వయసుతో సంబంధం లేదు” అంటూ తెలిపింది. దీంతో టబు చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి. మరి టబు నిజంగానే పెళ్లి చేసుకోకుండా సరోగసి ద్వారా తల్లి అవుతుందా చూడాలి.