Talasani Srinivas Yadav : తెలంగాణలో థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ‘‘సినిమాకు కులం, మతం, ప్రాంతం అనే భావన ఉండదు. సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ అవసరం. ఇప్పుడున్న కరోనా........

Talasani Srinivas Yadav :  తెలంగాణలో థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు

Talasani

Updated On : January 13, 2022 / 6:21 PM IST

Talasani Srinivas Yadav :   ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ రోజూ చర్చల్లో నిలుస్తుంది. ఒకపక్క కరోనాతో సినిమాలు వాయిదా పడటం, మరో పక్కా ఆక్యుపెన్సీ తగ్గిస్తామనటం, మరో పక్క ఏపీలో టికెట్ రేట్ల సమస్యలు, థియేటర్ల మూసివేత.. ఇలా రోజూ సినీ పరిశ్రమకి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినీ పరిశ్రమ గురించి ఎవరూ ఏం మాట్లాడినా అది వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సినిమాల గురించి, సినీ పరిశ్రమల గురించి మాట్లాడారు.

Chiranjeevi : ముచ్చటగా మూడో సారి.. జగన్ చిరు భేటీ.. సినీ పరిశ్రమకి లాభం చేకూరిందా??

హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ అనే టీజర్ లాంచ్ లో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ‘‘సినిమాకు కులం, మతం, ప్రాంతం అనే భావన ఉండదు. సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ అవసరం. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ‘అఖండ, పుష్ప’ సినిమాల రాకతో ఇండస్ట్రీ కొంత పుంజుకుంది. చిత్ర పరిశ్రమ ఇంకా పుంజుకోవాలని తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలను పెంచడంతో పాటు 5వ ఆటకు కూడా అనుమతి ఇచ్చాం. షూటింగ్‌ల పర్మిషన్‌ కోసం సింగిల్‌ విండో విధానాన్ని ఓకే చేశాం. తెలంగాణలో ప్రస్తుతానికి థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పరిస్థితులు ఉధృతంగా ఉంటే ఆంక్షలు విధిస్తాం. త్వరలోనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ని అందుబాటులోకి తీసుకొస్తాం.” అని అన్నారు.