ఇలా అయితే తట్టుకునేదెలా తమన్నా!..

ఇలా అయితే తట్టుకునేదెలా తమన్నా!..

Tamannaah Bhatia Aces Quarantine Pillow Challenge

Updated On : May 14, 2021 / 12:27 PM IST

ఈ లాక్‌డౌన్ పుణ్య‌మా అని ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది త‌మ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తుంటే.. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో పాటు రకరకాల ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఇటీవల పిల్లో ఛాలెంజ్ అంటూ ‘ఆర్‌ఎక్స్100’ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ రచ్చ లేపింది.

తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా పిల్లో ఛాలెంజ్‌లో పాల్గొని హీటెక్కించింది. పిల్లోతో నేలపై పాలరాతి శిల్పం సజీవంగా పడుకుని ఉందా అనేలా అబ్బురపరుస్తుందీ ఫొటో. తమన్నా ‘I’m off to club bed featuring DJ pillow and MC blanket’ అంటూ ఈ పిక్ ఇన్‌స్టాలో షేర్ చేయగా భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి కానీ చూసిన వాళ్లకి నోటి వెంట మాటలే రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి లాక్‌డౌన్ వేళ రకరకాల ఛాలెంజ్‌‌ల పేరుతో అందాలారబోస్తూ ఆకట్టుకుంటున్నారు ముద్దు గుమ్ములు.