Tamannaah Bhatia : మాల్దీవుల్లో ఐస్‌క్రీం అమ్ముతున్న తమన్నా

ప్రస్తుతం తమన్నాకి షూటింగ్స్ నుండి గ్యాప్ దొరకడంతో సెలబ్రిటీల ఫేవ‌రేట్ టూరిజం స్పాట్ అయిన మాల్దీవులకు చెక్కేసింది. మాల్దీవుల్లో ప్రస్తుతం తమన్నా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.....

Tamannaah Bhatia : మాల్దీవుల్లో ఐస్‌క్రీం అమ్ముతున్న తమన్నా

Tamanna

Updated On : March 20, 2022 / 5:33 PM IST

Tamannaah Bhatia :  తెలుగు, తమిళ్ సినిమాల్లో దాదాపు 15 ఏళ్ళ పాటు కెరీర్ తో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది తమన్నా. తెలుగు, తమిళ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. ఇప్పటికి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. తెలుగులో తమన్నా త్వరలో ఎఫ్ 3, గుర్తుందా సీతాకాలం, భోళాశంక‌ర్ సినిమాలతో ప్రేక్షకులని పలకరించనుంది.

Pooja Hegde : ప్రభాస్‌తో కలిసి ‘బాహుబలి 3’లో నటించాలనుంది

ప్రస్తుతం తమన్నాకి షూటింగ్స్ నుండి గ్యాప్ దొరకడంతో సెలబ్రిటీల ఫేవ‌రేట్ టూరిజం స్పాట్ అయిన మాల్దీవులకు చెక్కేసింది. మాల్దీవుల్లో ప్రస్తుతం తమన్నా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. అక్కడి సముద్రపు బీచ్ లలో సరదాగా తిరుగుతుంది. అయితే అక్కడ ఓ ఐస్ క్రీం అమ్మే బండిని తీసుకొని అది తొక్కుతున్న ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేవీ బ్లూ షార్ట్స్, ఫ్లోర‌ల్ పింక్ జాకెట్ లో అందాలు ఆరబోస్తూ ఐసీక్రీమ్ సైకిల్ ట్రాలీని తీసుకొని బీచ్ లో చక్కర్లు కొట్టింది. దీంతో తమన్నా ఐసీక్రీమ్ అమ్ముతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ”ఈ ట్రంక్‌లో మొత్తం ఐస్‌క్రీమ్ ఎవరి వద్ద ఉందో ఊహించండి” అంటూ పోస్ట్ పెట్టింది.