Vijay : తమిళ హీరో విజయ్ పార్టీ పేరు.. అర్థం ఏంటో తెలుసా..?

తమిళ హీరో విజయ్ "తమిళక వెట్రి కజగం" అనే పేరు తన పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు. ఇక పేరు చూసిన తెలుగు ఆడియన్స్ దాని అర్ధం తెలుసుకోవడం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

Vijay : తమిళ హీరో విజయ్ పార్టీ పేరు.. అర్థం ఏంటో తెలుసా..?

Tamil Actor Vijay launches his political party named as Tamilaga Vetri Kazhagam

Vijay : కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఇన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్.. నేటితో ముగిసింది. తాను రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విజయ్ అధికారిక ప్రకటన చేసేశారు. ఇన్నాళ్లు ‘విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సేవలు చేసిన తాను.. పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణల్లో మార్పు తీసుకురావడం కోసం రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

ఇక ఈ పార్టీకి “తమిళ వెట్రి కజగం” అనే పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ వార్త తమిళనాటతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఈక్రమంలోనే పార్టీ పేరు విన్న తెలుగు ఆడియన్స్.. తమిళ భాషలో ఉన్న ఆ పేరు మీనింగ్ ఏంటని ఆలోచిస్తున్నారు. దాని అర్ధం తెలుసుకోవడం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తూ.. ఆ పదాన్ని అనువదించి తెలుసుకుంటున్నారు.

పార్టీ పేరులోని మొదటి పదం ‘తమిళ’ అంటే తమిళం. ‘వెట్రి’ అంటే విక్టరీ/సక్సెస్ అని అర్ధం వస్తుంది. ఇక చివరి పదం ‘కజగం’ అంటే క్లబ్/పార్టీ అని వస్తుంది. మొత్తం మీద ఆ పార్టీ పేరుకి అర్ధం.. ‘తమిళ విక్టరీ క్లబ్’ అని వస్తుంది. కాగా విజయ్ పేరు మీద గతంలో ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్.. ఒక పార్టీని రిజిస్టర్ చేయించారు. చాలామంది విజయ్ ఆ పార్టీనే ముందుకు తీసుకు వెళ్తారని అనుకున్నారు.

Also read : 92 ఏళ్ళ సినీ చరిత్రలో ‘హనుమాన్’ సరికొత్త సంచలనం..

కానీ విజయ్ అలా కాకుండా, కొత్త పార్టీని తెరపైకి తీసుకు వచ్చారు. ఇక పార్టీ ద్వారా ఆయన పాలనాపరమైన దురాచారాలు, అవినీతి రాజకీయ సంస్కృతి, కులమత విభజన వంటి దురాచారాలు పై పోరాటం చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ భూమికి పుట్టుకతో అందరూ సమానమే అనే సమానత్వ సూత్రంతో తాను ముందుకు తీసుకు వెళ్తానని, అలాంటి మౌలికమైన రాజకీయ మార్పు ప్రజల ఏకగ్రీవ అభిమానం మరియు ప్రేమ కలిగిన ప్రజాశక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.