Vishal : చంద్రబాబు అరెస్ట్ పై హీరో విశాల్ కామెంట్స్.. భయం కలుగుతోంది అంటూ..

చంద్రబాబు అరెస్ట్ పై హీరో విశాల్ రియాక్ట్ అయ్యాడు. అరెస్టుకు ముందు కొంచెం అలోచించి ఉంటే..

Vishal : చంద్రబాబు అరెస్ట్ పై హీరో విశాల్ కామెంట్స్.. భయం కలుగుతోంది అంటూ..

Tamil actor Vishal comments on Chandrababu Naidu arrest

Updated On : September 20, 2023 / 6:24 PM IST

Vishal – Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం పై అభిమానులు, ఐటీ ఉద్యోగులు, పలువురు ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం పై సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు స్పదించగా.. అటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేశారు. తాజాగా మరో తమిళ హీరో విశాల్ కూడా స్పందించారు.

విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) చిత్రం రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దీంతో నేడు హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి విశాల్ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో విశాల్ చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

Samantha : ఇన్ని బాధలు పడతాను అని అనుకోలేదు.. టీనేజర్స్ కి సమంత సలహాలు..

“అరెస్టుకు ముందు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యులకు ఒక భయం కలుగుతుంది. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది” అంటూ విశాల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Celebrating ANR 100 : అక్కినేని కోసం వచ్చిన బాలీవుడ్ స్టార్ నటుడు..

కాగా విశాల్ చిన్నతనం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే సాగింది. గతంలో విశాల్ కుప్పం రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, వైసీపీ నుంచి బరిలోకి దిగి చంద్రబాబు పై పోటీ చేయనున్నాడని ప్రచారం జరిగింది. విశాల్ కూడా తనకి జగన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు గురించి ఇలా కామెంట్స్ చేయడంతో వైరల్ గా మారాయి.