Marimuthu : గుండెపోటుతో తమిళ్ స్టార్ నటుడు కన్నుమూత.. ఇటీవలే జైలర్ సినిమాతో..

తమిళ్ సీనియర్ నటుడు, దర్శకుడు మరిముత్తు నేడు ఉదయం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు.

Marimuthu : గుండెపోటుతో తమిళ్ స్టార్ నటుడు కన్నుమూత.. ఇటీవలే జైలర్ సినిమాతో..

Tamil Star Actor Marimuthu Passed away with Heart attack

Updated On : September 8, 2023 / 11:01 AM IST

Marimuthu : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. పలువురు సినీ ప్రముఖులు కన్ను మూసి విషాదం నింపుతున్నారు. తాజాగా తమిళ పరిశ్రమలో స్టార్ నటుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. తమిళ్ సీనియర్ నటుడు, దర్శకుడు మరిముత్తు నేడు ఉదయం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. దీంతో తమిళ సినీ ప్రముఖులు, ప్రేక్షకులు, నెటిజన్లు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

మరిముత్తు 1999 లో అజయ్ వాలి సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బిజీ అయ్యాడు. మరిముత్తు తమిళ్ లో దాదాపు 80 సినిమాలకు పైగా నటించి మెప్పించాడు. పలు సీరియల్స్ లో కూడా నటించాడు. అలాగే డైరెక్టర్ గా కూడా మూడు సినిమాలు తెరకెక్కించాడు మరిముత్తు.

Mahesh Babu Pet Dog : మహేష్ బాబు ఇంట్లో ప్లూటో చనిపోయింది.. స్నూపీ వచ్చింది..

ప్రస్తుతం కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు మరిముత్తు. ఇటీవలే చివరిసారిగా రజినీకాంత్ జైలర్ సినిమాలో విలన్ పక్కనే ఉండే పాత్రలో నటించి మెప్పించాడు. ఇవాళ ఉదయం గుంటుపోటుతో మరిముత్తు 56 ఏళ్ళ వయసులో హఠాత్తుగా మరణించడంతో తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.