Tammareddy Bharadwaj : ఈ సినిమా చేయకూడదు అని ఎక్కువ రెమ్యునరేషన్ అడిగాను.. అయినా.. తమ్మారెడ్డి కామెంట్స్..

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ..

Tammareddy Bharadwaj : ఈ సినిమా చేయకూడదు అని ఎక్కువ రెమ్యునరేషన్ అడిగాను.. అయినా.. తమ్మారెడ్డి కామెంట్స్..

Tammareddy Bharadwaj Sensational Comments in O Andala Rakshasi Movie Event

Updated On : March 20, 2025 / 11:04 AM IST

Tammareddy Bharadwaj : షెరాజ్ మెహదీ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ పై సురీందర్ కౌర్ నిర్మాతగా, తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ఓ అందాల రాక్షసి’ సినిమా మార్చ్ 21న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Also Read : Jack Song : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ‘జాక్’ సినిమా నుంచి.. ముద్దు సాంగ్ రిలీజ్..

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. రచయిత భాష్య శ్రీ ఈ కథను తీసుకొచ్చి ఈ సినిమాను కచ్చితంగా చేయాలని అన్నారు. వీళ్ళని ఎలాగైనా వదిలించుకోవాలని పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ చెప్పాను. అంత వీళ్ళు ఎలాగో ఇవ్వరు నన్ను వదిలేస్తారని అనుకున్నాను. కానీ నేను అడిగినంత డబ్బు ఇచ్చారు. నేను మళ్ళీ అడగకముందే డబ్బులు ఇచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్లో ఇంత మొత్తం చూసింది ఇదే మొదటిసారి. ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా కథ చాలా బాగుంది. ఇలాంటి చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధించాలి అని అన్నారు.

Tammareddy Bharadwaj

నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. చిన్న సినిమాల్లో నటించి మాలాంటి వాళ్లకు సపోర్ట్ ఇచ్చిన తమ్మారెడ్డి గారికి థ్యాంక్స్. ఇప్పటివరకు సినీ పరిశ్రమలో క్రమశిక్షణతోనే సినిమాలు చేస్తున్నాను. ఇకపై కూడా అలానే చేస్తాను. ఓ అందాల రాక్షసి సినిమా థియేటర్లోకి రానంతవరకే చిన్న సినిమా. థియేటర్ లోకి వచ్చాక దాని రేంజ్ ఏంటో ఆడియన్స్ కి తెలుస్తుంది. ఈ సినిమా మార్చి 21న రాబోతోంది అని అన్నారు.