Tanish: కేసీపీడీ అంటున్న తనిష్.. కొత్త సినిమా ప్రకటించిన యువ హీరో
నచ్చావులే చిత్రంతో కథానాయకుడిగా మారిన తనిష్ ఆ తర్వాత ‘మేం వయసుకు వచ్చాం’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ ‘రైడ్’ వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా చేశాడు. ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ వరుసగా చిత్రాలు చేస్తూ, ప్రేక్షుకుల్ని అలరిస్తున్నాడు. తాజాగా తనిష్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.

Tanish: బాల నటుడిగా అనేక చిత్రాల్లో నటించి, అనంతరం హీరోగా మారాడు తనిష్. నచ్చావులే చిత్రంతో కథానాయకుడిగా మారిన తనిష్ ఆ తర్వాత ‘మేం వయసుకు వచ్చాం’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ ‘రైడ్’ వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా చేశాడు.
Zeenat Aman: తన తొలి లుక్ టెస్ట్ ఫొటో షేర్ చేసిన జీనత్ అమన్.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు నెటిజన్లు ఫిదా
ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ వరుసగా చిత్రాలు చేస్తూ, ప్రేక్షుకుల్ని అలరిస్తున్నాడు. తాజాగా తనిష్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ‘కేసీపీడీ (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్)’ పేరుతో ఈ సినిమా తెరకెక్కున్నట్లు వెల్లడించాడు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. వేద ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, గోదావరి ఆంధ్రా రెస్టారెండ్ దుబాయ్ వారి సహకారంతో కార్తీక్ రెడ్డి, వరుణ్ దగ్గుబాటి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
గౌతమ్ మన్నవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుండగా శుభశ్రీ రాయగురు, దివ్యా దిచోల్కర్, ప్రియాంక నిర్వాణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా, ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, వచ్చే సమ్మర్‌లోనే చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.