Hanuman : సంక్రాంతికి వస్తున్న హనుమాన్.. స్టార్ హీరోల మధ్య తేజ సజ్జ పాన్ ఇండియా పోటీ..

ఇప్పటికే ‘హనుమాన్’ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవ్వకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు చిత్రయూనిట్.

Hanuman : సంక్రాంతికి వస్తున్న హనుమాన్.. స్టార్ హీరోల మధ్య తేజ సజ్జ పాన్ ఇండియా పోటీ..

Teja Sajja Hanuman Movie Release date announced ready to release in Sankranthi season

Hanuman :  కొత్త రకం సినిమాలతో తెలుగులో అతి తక్కువ సమయంలో గుర్తింపు, అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు ‘ప్రశాంత్ వర్మ’. మొదటి సినిమా నుంచి వైవిధ్యాన్ని చూపిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ యువహీరో ‘తేజ సజ్జ’తో తెరకెక్కించిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్.. ఆడియన్స్ లో అంచనాలను పెంచింది. వందల కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలో కూడా చూపించనంత క్వాలిటీగా తక్కువ ఖర్చుతూ, చాలా ఎఫెక్టివ్ గా చూపించడంతో సినీ లవర్స్ హనుమాన్ టీజర్ కి ఫిదా అయ్యిపోయారు. ఇక టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది. ఇటీవల ఆదిపురుష్ VFX మీద బాగా ట్రోల్స్ రావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అన్ని వందల కోట్లు పెట్టి VFX చేయించిన ఆదిపురుష్ కంటే ఈ సినిమా VFX బాగుందని టీజర్ చూశాక అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ‘హనుమాన్’ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవ్వకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా 12 జనవరి 2024 రాబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షేర్ చేస్తూ.. ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు కష్టపడ్డాను, మీకు ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ఇంకో 6 నెలలు కష్టపడతాను అని ప్రకటించాడు.

Jawan : షారుఖ్ జవాన్.. కేవలం మ్యూజిక్ రైట్స్‌కి ఏకంగా అన్ని కోట్లా..?

ఇప్పటికే సంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ K, మహేష్ గుంటూరు కారం, రవితేజ ఈగల్ సినిమాలు బరిలో ఉన్నాయి. స్టార్ హీరోల మధ్య తేజ సజ్జ తన హనుమాన్ సినిమాతో వచ్చి ప్రేక్షకులని ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి మరి. ఇక అభిమానులు ఈ సినిమా కోసం అన్ని రోజులు వెయిట్ చేయాలా అని కామెంట్స్ చేస్తున్నారు.