Hanuaman : ‘హనుమాన్’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. వినాయక చవితి నుంచి..

హనుమాన్ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ అప్డేట్ తో పాటు ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

Hanuaman : ‘హనుమాన్’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. వినాయక చవితి నుంచి..

Teja Sajja Prasanth Varma Hanuaman movie update

Hanuaman : టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘హనుమాన్’. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ రావడం, ఆ తరువాత జరిగిన సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్.. ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది. టీజర్ లోని గ్రాఫిక్స్ చాలా ఎఫెక్టివ్ గా చూపించడంతో సినీ లవర్స్ ఫిదా అయ్యిపోయారు.

Mrunal Thakur : తెలుగు నేర్చుకోవడానికి మృణాల్ ఎంత కష్టపడుతుందో చూడండి.. హీరోయిన్స్ అంతా ఇలా నేర్చుకుంటే బాగుండు..

ఇక ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లేట్ అవ్వడంతో విడుదల వాయిదా పడింది. VFX విషయంలో ఎటువంటి రాజీపడకుండా తెరకెక్కిస్తుండడంతోనే మూవీ లేటుకి కారణం. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే, చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఏరకమైన ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు.

Mukesh Udeshi : చిరంజీవి సినిమాల నిర్మాత కన్నుమూత.. కాపాడుకోవడానికి అల్లు అరవింద్ ప్రయత్నించినా..

తాజాగా దర్శకుడు దీని మీద ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ వినాయకచవితి నుంచి మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు ఒక ట్వీట్ చేశాడు. మరి ఆ రోజున ప్రశాంత్ వర్మ ఎలాంటి అప్డేట్ ఇస్తాడో చూడాలి. అలాగే ఈ ట్వీట్ తో రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. సంక్రాంతికి బడా సినిమాల రిలీజ్ లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో హనుమాన్ వాటితో పోటీగా రిలీజ్ అవుతుందా..? అని అందరిలో సందేహం నెలకుంది. ఇప్పుడు ఈ ట్వీట్ లో ప్రశాంత్ వర్మ సంక్రాంతి రిలీజ్ అని కూడా ట్వీట్ చేయడంతో ఆ అనుమానాలకు చెక్ పడింది. కాగా ఈ మూవీలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుంటే వినయ్ రాయి ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు.