HanuMan : హనుమాన్ 2 కూడా ఉంది.. బాహుబలి లెవెల్ ట్విస్ట్.. ‘జై హనుమాన్’ అప్పుడే వచ్చేది..

హనుమాన్ హిట్ అయితే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీక్వెల్‌ని మూవీ ఎండ్‌లోనే అనౌన్స్ చేసేశారు. అది కూడా బాహుబలి లెవెల్ ట్విస్ట్..

HanuMan : హనుమాన్ 2 కూడా ఉంది.. బాహుబలి లెవెల్ ట్విస్ట్.. ‘జై హనుమాన్’ అప్పుడే వచ్చేది..

Teja Sajja Prashanth Varma Hanuman Movie sequel announced with Baahubali level twist

Updated On : January 12, 2024 / 9:03 AM IST

HanuMan : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ సూపర్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. రామ భక్తుడు హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే.. ఆ కథ ఎలా ఉంటుందో దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడంటూ సినిమా చూసిన వారంతా చెబుతున్నారు.

హిందూ పురాణాలను టచ్ చేసినా.. ఎక్కడా లైన్ దాటకుండా అందరు అంగీకరించేలా తెరకెక్కించారని పేర్కొంటున్నారు. ఇక సినిమాలోని గ్రాఫిక్స్ షాట్స్, VFX సీన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ అంటున్నారు. మూవీలోని చాలా సీన్స్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా సినిమా చివర్లో ఆంజనేయస్వామి షాట్స్ అయితే ఆడియన్స్ ని సీట్ లో కూర్చోనివ్వవు అంటున్నారు.

Also read : Hanuman Review : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..

కాగా ఈ మూవీ హిట్ అయితే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ ని కూడా మూవీ ఎండ్ లోనే అనౌన్స్ చేసేశారు. హనుమాన్ 2కి లీడ్ ఇస్తూ బాహుబలి లెవెల్ ట్విస్ట్ పెట్టారంట. బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అనే ట్విస్ట్‌ సెకండ్ పార్ట్ పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ పెట్టారంట.

ఇక ఈ సీక్వెల్ కి ‘జై హనుమాన్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఈ చిత్రాన్ని 2025కి తీసుకు రాబోతున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ జై హనుమాన్ పై భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రం నార్త్ ఆడియన్స్ విపరీతంగా నచ్చేస్తుందని సౌత్ ఆడియన్స్ చెబుతున్నారు. గతంలో నిఖిల్ ‘కార్తికేయ 2’ కూడా ఇలానే మైథిలాజికల్ కాన్సెప్ట్ తో భారీ విజయం సాధించింది. ఇప్పుడు హనుమాన్ కూడా అలాంటి బ్లాక్ బస్టర్ ని నమోదు చేస్తుందని పేర్కొంటున్నారు.