Tejaswini : మా పెళ్ళికి ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు.. ఆయనే ఒప్పించారు.. దిల్ రాజుతో పెళ్లి పై తేజస్విని..

దిల్ రాజు - తేజస్విని ఒక ఫ్లైట్ లో కలిసి అనంతరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Tejaswini : మా పెళ్ళికి ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు.. ఆయనే ఒప్పించారు.. దిల్ రాజుతో పెళ్లి పై తేజస్విని..

Tejaswini Vygha Tells about struggles for her marriage with Dil Raju

Updated On : June 28, 2025 / 2:58 PM IST

Tejaswini : దిల్ రాజు కొన్నేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన తేజస్విని వ్యాఘాని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. దిల్ రాజు భార్య తేజస్విని రెగ్యులర్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. దిల్ రాజుతో పెళ్లి తర్వాత మొదటిసారి తేజస్విని ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో తమ పెళ్లి గురించి తెలిపింది. దిల్ రాజు – తేజస్విని ఒక ఫ్లైట్ లో కలిసి అనంతరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read : Kannappa : కన్నప్ప అదిరిందప్ప.. ఫస్ట్ డే కలెక్షన్స్.. మంచు విష్ణు అదరగొట్టడుగా..!

తాజాగా తేజస్విని మాట్లాడుతూ.. అసలు మా ఫ్యామిలీకి సినిమాలకు కనెక్షన్ చాలా తక్కువ. సంవత్సరానికి ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళం అంతే. దిల్ రాజు గారిని మొదట డైరెక్టర్ అనుకున్నాను. తర్వాత నిర్మాత అని తెలిసింది. ఫ్లైట్ లో పరిచయం, ప్రేమ తర్వాత దిల్ రాజు గారే మా ఇంట్లో ఎవర్ని అడగాలో చెప్పు అడిగి ఒప్పిస్తా అన్నారు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. మా పెద్దమామ, పిన్ని, చిన్నమామ చాలా స్ట్రిక్ట్. మా పిన్ని, మామ ఎవరూ ఒప్పుకోలేదు పెళ్ళికి. అసలు వద్దన్నారు. అందులోను రెండో పెళ్లి అనేసరికి అస్సలు వద్దన్నారు. కానీ అందర్నీ ఒప్పించి చేసుకున్నాం అని తెలిపారు.

Also Read : Ileana : రెండో సారి తల్లి అయిన పోకిరి భామ.. ఈసారి కూడా బాబే.. పేరేంటో తెలుసా?