Lata Mangeshkar : భారతీయ సినిమాకు ఆమె చేసిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది : తమిళిసై సౌందరరాజన్

భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో, మీడియా ప్రకటనలో లతా మంగేష్కర్ కు నివాళులు..

Lata Mangeshkar :  భారతీయ సినిమాకు ఆమె చేసిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది : తమిళిసై సౌందరరాజన్

Tamilisai

Updated On : February 6, 2022 / 6:55 PM IST

Lata Mangeshkar :  భారత గానకోకిల, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి మరియు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరారు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూనే ఆదివారం ఉదయం కన్నుమూశారు. సింగర్ లతా మంగేష్కర్ మరణంపై దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు ఆమె గురించి పోస్ట్ చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.

Pawan Kalyan : హరిహర వీరమల్లు.. మరో అప్డేట్.. తమిళ రచయితతో పవన్..

భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో, మీడియా ప్రకటనలో లతా మంగేష్కర్ కు నివాళులు అర్పించారు గవర్నర్. ” భారతీయ సినిమా నైటింగేల్ & లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం గురించి విని చాలా బాధపడ్డాను. భారత నైటింగేల్‌గా పేరొందిన లతా మంగేష్కర్ తన దివ్య గాత్రంతో వందలాది పాటలను చిరస్థాయిగా నిలిపారని అన్నారు. ఆమె తన మాయా స్వరంతో తరాల ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. భారతీయ సినిమాకు, దేశానికి ఆమె చేసిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని డా.తమిళిసై అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు గవర్నర్.