Balagam : సిద్దు జొన్నలగడ్డ, ప్రియదర్శి తెలంగాణ గర్వపడేలా చేస్తున్నారు.. మంత్రి కేటిఆర్!
జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా 'బలగం'. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటిఆర్ హాజరయ్యాడు. ఇక ఈవెంట్ లో..

telangana minister ktr says siddu jonnalagadda, priyadarshi, rahul ramakrishna, naveen polishetty making telangana proud
Balagam : జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘బలగం’. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో నటించిన ‘బేబీ కావ్య’ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. భీమస్ సెసిరోలె ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మార్చి 3న రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే నిన్న (ఫిబ్రవరి 28) ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సిరిసిల్లలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటిఆర్ హాజరయ్యాడు.
Balagam : రిలీజ్ కి ముందే యాత్రలు చేస్తున్న దిల్ రాజు.. బలగం మూవీ!
ఇక ఈవెంట్ లో కేటిఆర్ మాట్లాడుతూ.. ”తెలంగాణ గడ్డ పై పుట్టిన ఎంతమంది కళాకారులు నేడు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు. ఆ వరుసలోనే దర్శకుడు వేణు, సింగర్ మంగ్లీ, కాసర్ల శ్యామ్, దర్శకుడు అనుదీప్.. ఇలా ఎంతో మంది తమ టాలెంట్ తో పైకి వస్తున్నారు. ఇక సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. సినిమాల్లో తెలంగాణ భాష మాట్లాడుతూ, మన భాషకి ఒక ప్రాధాన్యతని తెస్తున్నారు. ఇతర స్టార్ లు కూడా మన భాషని మాట్లాడేలా ప్రభావితం చేస్తున్నారు.
ఒకప్పుడు తెలంగాణ భాష, యాస్ మాట్లాడాలి అంటే మొహమాటం పడేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే భాషని ఇతరులు మాట్లాడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందర్నీ ప్రభావితం చేసిన సిద్దు, దర్శి, నవీన్, రాహుల్ లను చూసి తెలంగాణ చాలా గర్వపడుతుంది” అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ సినిమా దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మిస్తుంది. ఆమె గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాతో మంచి విజయం సాధించి, కెరీర్ లో మంచి నిర్మాతగా ఎదిగి మీ నాన్న దిల్ రాజు కంటే గొప్ప పేరుని తెచ్చుకోవాలని కోరుకుంటున్నా అంటూ వెల్లడించారు.