Bigg Boss 7 Day 85 : ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరు..?

ఫినాలీకి దగ్గరవుతుండడంతో కంటెస్టెంట్స్ లో కూడా పోరుతత్వం మరింత పెరిగింది. కాగా 13వ నామినేషన్స లో ఉన్నది ఎవరు..?

Bigg Boss 7 Day 85 : ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరు..?

Telugu Bigg Boss 7 Day 85 nominations and episode highlights

Updated On : November 28, 2023 / 8:41 AM IST

Bigg Boss 7 Day 85 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 ఇక ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఫినాలీకి దగ్గరవుతుండడంతో కంటెస్టెంట్స్ లో కూడా పోరుతత్వం మరింత పెరిగింది. ఒకరి ఆటని ఒకరు వేలెత్తి చూపిస్తూ గేమ్ ని హీటెక్కిస్తున్నారు. 12 వారాలు పూర్తి చేసుకునేప్పటికీ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో మిగిలారు. ఈ శని ఆదివారం ఎపిసోడ్స్ చాలా ఇంటరెస్టింగ్ జరిగాయి. అశ్విని, రతిక ఎలిమినేషన్స్ తో వీకెండ్ బిగ్‌బాస్ ముగిసింది. ఇక హౌస్ లో 13వ వారానికి సంబంధించిన నామినేష‌న్స్ ప్ర‌క్రియ‌ మొదలయింది.

ఈ నామినేషన్స్ లో శివాజీ, గౌతమ్, ప్రియాంక, ప్రశాంత్, శోభా శెట్టి, ప్రశాంత్ మధ్య గట్టి మాటల యుద్ధమే జరిగింది. శివాజీ తనకి అనుకూలంగా ఉన్నవారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారని గౌతమ్ అనడం, అలాగే ప్రియాంక కూడా శివాజీ గురించి మాట్లాడుతూ.. మీరు నామీద చాలా నెగటివిటీ పెట్టుకున్నారంటూ చెప్పుకొచ్చారు. వీరిద్దరికి శివాజీ కూడా ధీటుగా సమాధానాలు ఇచ్చారు. ఇక శోభాశెట్టి యావర్ ని నామినేట్ చేసి.. ‘బాల్కనీలో గేమ్ ఓవర్ శోభా శెట్టి’ అని రాసిన విషయాన్ని గురించి ప్రశాంత్ తో వాదన చేసింది.

Also read : Mahesh Babu : యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ కపూర్‌తో కలిసి మహేష్ బాబు డాన్స్..

ఇలా హాట్ హాట్ గా జరిగిన నామినేషన్స్ ఈ వారం నామినేషన్స్ అమర్ దీప్ తప్ప అందరూ ఎలిమినేషన్ లో నిలిచారు. శివాజీ, గౌతమ్, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, శోభా శెట్టి నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఎవరు ఈ వీక్ బయటకి వస్తారో చూడాలి. ఫైనల్ రేసులో శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్, ప్రియాంక ఉంటారని కొందరు జోశ్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ఈ నలుగురు చాలా స్ట్రాంగ్ ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ నలుగురిలో పల్లవి ప్రశాంత్‌కే ఎక్కువ అవకాశం ఉందని, గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి తనకి ఓటు బ్యాంకు బాగా పెరిగిందని చెబుతున్నారు.