Keerthi Danush : తల్లైన నటి కీర్తి ధనుష్‌.. డాక్టర్‌ బాబు ఇంట్లో సంబరాలు

బుల్లితెర నటి కీర్తి ధనుష్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ ఆమె భర్త, బుల్లితెర నటుడు ధనుష్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే బాబు పేస్ కనపడకుండా కవర్ చేశారు. బాబుకు రుద్వేద్‌గా పేరు పెట్టినట్లు ధనుష్ వెల్లడించారు.

Keerthi Danush : తల్లైన నటి కీర్తి ధనుష్‌.. డాక్టర్‌ బాబు ఇంట్లో సంబరాలు

Keerthi Danush

Updated On : August 8, 2021 / 4:54 PM IST

Keerthi Danush : బుల్లితెర నటి కీర్తి ధనుష్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ ఆమె భర్త, బుల్లితెర నటుడు ధనుష్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే బాబు పేస్ కనపడకుండా కవర్ చేశారు. బాబుకు రుద్వేద్‌గా పేరు పెట్టినట్లు ధనుష్ వెల్లడించారు.

కీర్తి-ధనుష్‌ తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందడంతో బుల్లితెర నటులు సహా నెటిజన్లు ఈ కపుల్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలే కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో కీర్తి సీమంతం జరిగింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా కీర్తి బావ నిరుపమ్‌ అలియాస్‌ డాక్టర్‌బాబు అన్న విషయం తెలిసిందే. నిరుపమ్‌ భార్య మంజులా పరిటాల స్వయానా కీర్తికి అక్క. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది.

 

View this post on Instagram

 

A post shared by ??️????️???? (@jaidhanushofficial)