CCL 2023 : తెలుగు గడ్డ పై తెలుగు వారియర్స్‌కి సెమి ఫైనల్స్..

ఇటీవల మొదలైన సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) మ్యాచ్స్ ఫైనల్ స్టేజి కి వచ్చేశాయి. ఈరోజు సెమీ ఫైనల్ మ్యాచ్స్ విశాఖపట్నంలో జరగబోతున్నాయి.

CCL 2023 : తెలుగు గడ్డ పై తెలుగు వారియర్స్‌కి సెమి ఫైనల్స్..

telugu warriors semi final match with karnataka bulldozers

Updated On : March 24, 2023 / 11:41 AM IST

CCL 2023 : మన దేశంలో అందరు ఎక్కువుగా ఇష్టపడేది.. ఒకటి సినిమా అయితే, మరొకటి క్రికెట్. ఇక ఈ రెండు కలిసి సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) మ్యాచ్స్ ద్వారా ఒకే ప్లాట్‌ఫార్మ్ పైకి వచ్చి ఆడియన్స్ కి డబుల్ ట్రీట్ ఇస్తుంటుంది. దేశంలోని అన్ని సినీ పరిశ్రమలు కలిసి ఆడే ఈ లీగ్ మ్యాచ్స్ కొంత కాలంగా జరగడం లేదు. అయితే ఈ ఏడాది తిరిగి మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్స్ లో సెలబ్రేటిస్ ఆడుతున్న అట తీరు చూస్తుంటే దేశంలో ఐపిఎల్ (IPL) ముందుగానే స్టార్ అయ్యినట్లు అనిపిస్తుంది.

CCL 2023 : టేబుల్ టాప్‌లో తెలుగు వారియర్స్, చివరిలో బాలీవుడ్.. అఖిల్ స్ట్రైక్ రేట్ ఎంత ఉందో తెలుసా?

ఇక ఫిబ్రవరి 18న మొదలైన ఈ CCL మ్యాచ్స్ చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 16 మ్యాచ్‌లు జరగగా.. సెమీ ఫైనల్స్ కి భోజపురి దబాంగ్స్ (Bhojpuri Dabanggs), ముంబై హీరోస్ (Mumbai Heroes), తెలుగు వారియర్స్ (Telugu Warriors), కర్ణాటక బుల్ డోజర్స్ (Karnataka Bulldozers) చేరుకున్నారు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు విశాఖపట్నంలో నేడు (మార్చి 23) జరగబోతున్నాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు భోజపురి అండ్ ముంబై టీమ్స్ మధ్య జరగనుంది. సెకండ్ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు తెలుగు అండ్ కర్ణాటక టీమ్స్ మధ్య జరగనుంది. ఈ రెండు మ్యాచ్స్ లో విజేతలుగా నిలిచిన వారు ఫైనల్ మ్యాచ్ ఆడతారు. ఫైనల్ మ్యాచ్ రేపు (మార్చి 25) జరుగుతుంది.

ఈ మ్యాచ్‌లు రెండు ఇన్నింగ్స్ గా జరగుతున్న విషయం తెలిసిందే. 10 ఓవర్లు కలిపి ఒక ఇన్నింగ్స్. ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్స్ లో తెలుగు వారియర్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తో విధ్వంసం సృష్టించారు. అఖిల్, థమన్, అశ్విన్, ప్రిన్స్.. ఇలా ప్రతి ఒకరు స్టార్ ప్లేయర్స్ మాదిరి వికెట్స్ అండ్ రన్స్ తీస్తూ అదరగొట్టేశారు. తెలుగు గడ్డ పై జరుగుతుంది కాబట్టి ఆడియన్స్ నుంచి తెలుగు వారియర్స్ కి మంచి సపోర్ట్ ఉంటుంది. మరి కర్ణాటక పై కూడా విధ్వంసం సృష్టించి తెలుగు హీరోలు ఫైనల్ కి వెళ్తారా? లేదా? చూడాలి.