The Kashmir Files: ప్రధాని మోడీ మెచ్చిన సినిమా.. యూనిట్‌కు ప్రశంసలు

సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా అడపాదడపా మంచి సినిమాలు కూడా వస్తుంటాయి. సమాజంలో సమస్యలు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల బయోపిక్స్, సమాజం మర్చిపోలేని సంఘటనలు లాంటి యూనివర్సల్..

The Kashmir Files: ప్రధాని మోడీ మెచ్చిన సినిమా.. యూనిట్‌కు ప్రశంసలు

The Kashmir Files

Updated On : March 13, 2022 / 2:06 PM IST

The Kashmir Files: సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా అడపాదడపా మంచి సినిమాలు కూడా వస్తుంటాయి. సమాజంలో సమస్యలు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల బయోపిక్స్, సమాజం మర్చిపోలేని సంఘటనలు లాంటి యూనివర్సల్ సబ్జెక్టులతో కూడా సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిందే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా. 90వ దశకంలో కశ్మీర్​ పండిట్​లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా బాలీవుడ్‌ స్టార్స్ నటులైన అనుపమ్​ ఖేర్, మిథున్​ చక్రవర్తి, దర్శన్​ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించారు.

ఆర్టికల్ 370 ఆధారంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’

మార్చి 11న రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుండగా.. ఈ సినిమాకి ఇటీవలే హర్యానా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి. కాగా, ఈ సినిమా టీమ్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా యూనిట్‌ను అభినందించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను ఆయన ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మేము ఆ చిత్రాన్ని నిర్మించడంలో ఎప్పుడూ గర్వపడలేదు. ధన్యవాదాలు మోదీజీ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి రీట్వీట్‌ చేస్తూ నెటిజన్లతో పంచుకున్నారు.