The Kashmir Files Unreported : ది కశ్మీర్ ఫైల్స్ మరోసారి.. మరిన్ని సన్నివేశాలు జోడించి సిరీస్ రూపంలో.. ఈ సారి ఓటీటీ రికార్డులు టార్గెట్..
ప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాని సిరీస్ రూపంలో రిలీజ్ చేయనున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు మరిన్ని సన్నివేశాలు, అప్పట్లో కశ్మీర్ లో జరిగిన రియల్ సీన్స్ జోడించి ఒక డాక్యుమెంటరీ సిరీస్ లాగా 'ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్' సిరీస్ ని తీసుకురాబోతున్నారు.

The Kashmir Files Unreported series coming from Director Vivek Agnihotri in ZEE 5 Ott
The Kashmir Files Unreported : బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ది కశ్మీర్ ఫైల్స్. మార్చ్ 11న చిన్న సినిమాగా రిలీజైన కశ్మీర్ ఫైల్స్ పబ్లిక్ టాక్ తోనే భారీ విజయాన్ని అందుకుంది. 1990 దశకంలో కశ్మీర్ లో అక్కడి హిందువులపై జరిగిన మారణకాండ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, నరేంద్రమోడీ సహా ఈ సినిమాని అంతా అభినందించారు.
కేవలం మౌత్ టాక్ తోనే ది కశ్మీర్ ఫైల్స్ సినిమా భారీ విజయం సాధించి 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా థియేటర్స్ లో 50 రోజులు కూడా ఆడింది. ది కశ్మీర్ ఫైల్స్ సంచలనాలతో పాటు వివాదాలకు కూడా దారి తీసింది. ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాని సిరీస్ రూపంలో రిలీజ్ చేయనున్నారు.
Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి.. కాబోయే స్టార్ హీరోయిన్.. వరుస సినిమాలతో ఒక్కసారిగా బిజీ..
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు మరిన్ని సన్నివేశాలు, అప్పట్లో కశ్మీర్ లో జరిగిన రియల్ సీన్స్ జోడించి ఒక డాక్యుమెంటరీ సిరీస్ లాగా ‘ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్’ సిరీస్ ని తీసుకురాబోతున్నారు. జీ5 ఓటీటీలో ‘ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్’ ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో డైరెక్టర్ వివేక్ మరోసారి ‘ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్’ ని ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. థియేటర్స్ లో సంచలనం సృష్టించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఇప్పుడు ఓటీటీలో సిరీస్ గా ‘ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్’ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
The most honest and gut wrenching series on Kashmir Genocide of Hindus is coming on 11th August. #KashmirUnreported – Only on @ZEE5India pic.twitter.com/OfWrNtr5Nm
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 30, 2023