Adah Sharma : కేరళ స్టోరీ దర్శకుడు, హీరోయిన్ అదా శర్మకి యాక్సిడెంట్.. హాస్పిటల్‌కి తరలింపు!

కేరళ స్టోరీ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడు సుదీప్తో సేన్‌, హీరోయిన్ అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గాయాలు పాలైన వారిని..

Adah Sharma : కేరళ స్టోరీ దర్శకుడు, హీరోయిన్ అదా శర్మకి యాక్సిడెంట్.. హాస్పిటల్‌కి తరలింపు!

The Kerala Story director Sudipto Sen heroine Adah Sharma met accident

Updated On : May 14, 2023 / 7:57 PM IST

The Kerala Story Star Adah Sharma : అదా శర్మ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story ). సుదీప్తో సేన్‌ (Sudipto Sen) డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలకు ఎన్నో సమస్యలు ఎదురుకుంది. కానీ రిలీజ్ తరువాత ఆ సమస్యలు, ఆ వివాదాలు సినిమా విజయాన్ని ఏ మాత్రం ఆపలేకపోయాయి. వివాదాల కారణంగా చాలా తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయిన ఈ చిత్రం మౌత్ టాక్ తో జనాల్లోకి వెళ్లి కేవలం 9 రోజుల్లోనే 112.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ సక్సెస్ తో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషిలో ఉంది.

Upasana : నేను వారసత్వాన్ని కొనసాగించాలని బిడ్డని కనడం లేదు.. ఉపాసన వైరల్ పోస్ట్!

అయితే ఈ సమయంలో దర్శకుడు సుదీప్తో సేన్‌, హీరోయిన్ అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో జరుగుతున్న ఒక ప్రైవేట్ ఈవెంట్ కి వీరిద్దరూ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో సుదీప్తో సేన్, ఆదా శర్మ గాయ పడడంతో వారిద్దర్నీ వెంటనే హాస్పిటల్ కి తరలించించారు. కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యినట్లు సమాచారం. అయితే వీరిద్దరూ ఈరోజు సాయంత్రం (మే 14) కరీంనగర్‌లో జరిగే హిందూ ఏక్తాయాత్రకు హాజరు కావాల్సి ఉంది. యాక్సిడెంట్ అవ్వడంతో ఆ కార్యక్రమానికి రాలేకపోతున్నాము అంటూ సుదీప్తో సేన్‌ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

Chiranjeevi – Pawan Kalyan : మెగా ఇంట మదర్స్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన చిరు.. పవన్ పిక్‌ని మాత్రం!

కాగా ఈ సినిమాలో ఆదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళలోని (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ స్టోరీ లైన్ వలనే అనేక విమర్శలకు గురి అయ్యింది. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అయితే ఈ సినిమాని ఏకంగా బ్యాన్ చేస్తూ ఉత్తర్వూలు కూడా జారీ చేశారు.