Peddi : భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పెద్ది షూటింగ్.. ఎక్కడో తెలుసా?

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Peddi : భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పెద్ది షూటింగ్.. ఎక్కడో తెలుసా?

The latest schedule of Peddi is currently underway

Updated On : June 18, 2025 / 9:21 AM IST

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. వ‌చ్చే ఏడాది మార్చి 27 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఓ భారీ రైలు సెట్‌ను నిర్మించారు. ఈ నెల 19 వ‌ర‌కు ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది.

Nagarjuna : ‘కింగ్’ ని రాక్షసుడిని చేసేసారు కదరా.. ఇన్నాళ్లు హీరోని చూసారు ఇప్పుడు..

ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. న‌వీన్ నూలి ఎడిట‌ర్‌. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.