Navya Swamy : బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చెయ్యడానికి రీజన్ అదే..

పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించడంతో పాటు ఎంతోమంది మహిళల ఆదరణ పొందిన నవ్య స్వామిని ఈ షో లో పార్టిసిపెట్ చెయ్యాల్సిందిగా కోరారట నిర్వాహకులు.

Navya Swamy : బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చెయ్యడానికి రీజన్ అదే..

Navya Swamy

Updated On : August 14, 2021 / 8:19 PM IST

Navya Swamy: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఈసారి అంచనాలకు అందకుండా రోజురోజుకి మరింత హైప్ క్రియేట్ చేస్తూ.. నెట్టింట రకరకాల వార్తలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు తెలుగులో నాలుగు సీజన్లు వచ్చాయి. ఒకదాన్ని మించి ఒకటి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అదే కోవలో ఐదో సీజన్ మోర్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రెడీ అవుతోంది.

Evaru MeeloKoteeswarulu : ‘వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా’..

ఇప్పటికే కంటెస్టెంట్ల పేర్లు, వారి పారితోషికాల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్, టీవీ మరియు సినిమా పరిశ్రమలో క్రేజ్, గుర్తింపున్న వారిని ఈసారి కంటెస్టెంట్స్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లోగో లాంచ్ తప్ప ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా పనులు కానిచ్చేస్తున్నారు షో నిర్వాహకులు.

Bigg Boss 5 : ‘బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’..

అయితే ఓ పాపులర్ నటి బిగ్ బాస్ ఆఫర్‌‌ని రిజెక్ట్ చేసిందని న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించడంతో పాటు ఎంతోమంది మహిళల ఆదరణ పొందిన నవ్య స్వామిని ఈ షో లో పార్టిసిపెట్ చెయ్యాల్సిందిగా కోరారట నిర్వాహకులు. అయితే షో రూల్స్ తను ఫాలో కాలేనని ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.

రూల్స్ ప్రకారం షో లో పార్టిసిపెట్ చేసే వారు ఇతర ఛానెళ్లలో కనిపించకూడదు. పైగా సీరియల్స్ ద్వారా బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న నవ్యకు అది కష్టమే. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘నా పేరు మీనాక్షి’ లో తన క్యారెక్టర్ వదులుకోవడం ఇష్టం లేకపోవడం, డైలీ సీరియల్‌తో రోజూ ప్రేక్షకుల ఇళ్లల్లోకి వెళ్లి ఎంటర్‌టైన్ చేసే తాను రోజుల తరబడి ఒకే ఇంట్లో ఉండిపోవడం నచ్చకనే నవ్య స్వామి బిగ్ బాస్ ఆఫర్‌‌ను తిరస్కరించిందట.

Aata Sandeep : ‘బిగ్ బాస్-5’ లో డ్యాన్సింగ్ కపుల్..