Jigel : ‘జిగేల్’ మూవీ రివ్యూ.. లాకర్ లో ఏముంది..?

జిగేల్ సినిమా నేడు మార్చ్ 7న థియేటర్స్ లో రిలీజయింది.

Jigel : ‘జిగేల్’ మూవీ రివ్యూ.. లాకర్ లో ఏముంది..?

Thrigun Megha Chowdhury Jigel Movie Review

Updated On : March 7, 2025 / 7:57 AM IST

Jigel Movie Review : త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘జిగేల్’. డాక్టర్ వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మాణంలో మల్లి యేలూరి దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. నాగార్జున అల్లం స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీ రాజ్, మధునందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయవాణి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. జిగేల్ సినిమా నేడు మార్చ్ 7న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. నందు(త్రిగుణ్) ఓ లాకర్ టెక్నీషియన్. ఎలాంటి లాకర్, తాళం అయినా ఓపెన్ చేయగలడు. దీంతో లైఫ్ లో సెటిల్ అవ్వాలని దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మీనా(మేఘా చౌదరి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు నందు. కానీ ఆమె కూడా దొంగ అని తెలిసిపోతుంది. రాజా చంద్ర వర్మ ప్యాలెస్ లో ఉండే ఓ పురాతన లాకర్ తెరుచుకోవడం లేదని, దాని ఒరిజినల్ తాళం లేదని మీనాకి తెలియడంతో ఆ ఇంటి ఓనర్ జేపీ(సాయాజీ షిండే) దగ్గర పి.ఎ.గా జాయిన్ అవుతుంది. ఆ లాకర్ ను నందుతో ఓపెన్ చేయించాలని ప్రయత్నించినా అది ఓపెన్ అవ్వదు.

అదే సమయంలో ఆ మహల్ తమదే అని, దానికి వారసురాలు నువ్వే అని మీనాకు ఆమె తల్లి చెప్తుంది. మరి ఈ విషయం తెలిసాకా మీనా ఏం చేసింది? ఆ లాకర్ ను తెరిచారా? లాకర్ ఒరిజినల్ తాళం ఎక్కడుంది? ఆ లాకర్ లో ఏ ముంది? ఆ లాకర్ ఎవరిది? రాజా చంద్ర వర్మ ప్యాలెస్ ఎవరిది? మీనా ఎందుకు దొంగతనాలు చేస్తుంది? జేపీ రాజు కాకపోతే అసలు రాజు ఎవరు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Kingston : ‘కింగ్‌స్టన్‌’ మూవీ రివ్యూ.. సముద్రంలో హారర్ తో భయపెట్టారుగా..

సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ పరిచయాలు వారి దొంగతనాలు, లవ్ స్టోరీ, లాకర్ గురించి తెలియడం, ఆ లాకర్ కోసం పలువురు ప్రయత్నిస్తుండటంతో కామెడీగా సాగుతుంది. ఇంటర్వెల్ కి అసలు ఆ ప్యాలెస్ హీరోయిన్ ది అని తెలియడంతో నెక్స్ట్ హీరోయిన్ ఏం చేసింది? ఆ లాకర్ తెరుచుకుందా అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ ఆ లాకర్ చుట్టూ, ఆ లాకర్ కథతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లోఆండ్రాయిడ్ బాబాగా పోసాని, లాయర్ గా 30 ఇయర్స్ పృద్వి, ముక్కు అవినాష్, మధు నందన్ బాగానే నవ్విస్తారు. కామెడీ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో లాకర్ చుట్టూ తిగిగే కథ థ్రిల్లింగ్ గా ఉంటుంది.

Jigel Movie Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. లాకర్ టెక్నీషియన్ గా త్రిగుణ్ తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తాడు. మేఘ చౌదరి ఓ పక్క అందాలు ఆరబోస్తూనే మరో పక్క బాగా నటించింది. మేఘకు నటనకు స్కోప్ ఉన్న పాత్ర పడింది. పోసాని ఫుల్ గా నవ్విస్తాడు. పృథ్వి, రఘుబాబు, ముక్కు అవినాష్, మధునందన్ అక్కడక్కడా నవ్విస్తారు. తల్లి పాత్రలో నళిని మెప్పిస్తుంది. షాయాజీ షిండే నెగిటివ్ పాత్రలో పర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Chef Mantra Project K : ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సుమ కనకాల ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K’ సీజన్ 4

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యావరేజ్. పాటలు కూడా ఓకే అనిపిస్తాయి. నిర్మాత నాగార్జున అల్లం ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లేను అందించారు. ఓ ఆసక్తికర కథని కామెడీగా చెప్పే ప్రయత్నం చేసారు. డైరెక్టర్ మల్లి యేలూరి బాగానే తెరకెక్కించారు. నిర్మాణ పరంగా కూడా చాలా మంది కమెడియన్స్ తో బాగానే ఖర్చుపెట్టి తెరకెక్కించారు.

మొత్తంగా ‘జిగేల్’ మూవీ ఓ లాకర్ చుట్టూ తిరిగే కామెడీ థ్రిల్లర్.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.