Mahesh Babu – Pawan Kalyan : మహేష్, పవన్‌తో ఆ తరహా సినిమా చేస్తానంటున్న క్రియేటివ్ డైరెక్టర్..

పవన్, మహేష్‌లతో ఛాన్స్ వస్తే ఏ జోనర్ లో సినిమా చేయాలో అని ఆలోచన చేసి పెట్టుకున్న టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్.

Mahesh Babu – Pawan Kalyan : మహేష్, పవన్‌తో ఆ తరహా సినిమా చేస్తానంటున్న క్రియేటివ్ డైరెక్టర్..

Tollywood director Vi Anand movie concept ideas for Mahesh Babu Pawan Kalyan

Updated On : February 18, 2024 / 11:24 AM IST

Mahesh Babu – Pawan Kalyan : టాలీవుడ్ లోని మేకర్స్ అంతా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. ఆ ఛాన్స్ వస్తే వినియోగించుకోవడం కోసం ముందుగానే ఓ జోనర్ ని సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు. ఇక ఆ ఛాన్స్ కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా ఓ క్రియేటివ్ డైరెక్టర్.. పవన్, మహేష్‌లతో ఛాన్స్ వస్తే ఏ జోనర్ లో సినిమా చేయాలో అని ఆలోచన చేసి పెట్టుకున్నారు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా.. వంటి క్రియేటివ్ కథలతో ఆడియన్స్ ని థ్రిల్ చేసే దర్శకుడు ‘వి ఐ ఆనంద్’. తాజాగా ఈ డైరెక్టర్ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఫాంటసీ థ్రిల్లర్ తో ఆకట్టుకొని హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న వి ఐ ఆనంద్.. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.

Also read : Chiranjeevi : ‘నా జీవన రేఖ’.. అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్.. ఎవరి గురించో తెలుసా..!

ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఏ జోనర్ ఏ హీరోతో చేయాలనే ఆలోచనలో ఉన్నారో ఆడియన్స్ కి తెలియజేసారు. మహేష్ బాబుతో జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఇక పవన్ కళ్యాణ్‌తో పొలిటికల్ డ్రామా మూవీ చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

అలాగే ఎన్టీఆర్‌తో రా అండ్ రస్టిక్ మూవీ, నానితో ప్యూర్ లవ్ స్టోరీ, నిఖిల్‌తో హారర్ కామెడీ, అడివి శేష్‌తో సస్పెన్స్ థ్రిల్లర్ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. కాగా నిఖిల్ తో ఆల్రెడీ హారర్ బ్యాక్‌డ్రాప్ లో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా చేశారు. ఆనంద్ తో కలిసి మరో సినిమా చేయడానికి నిఖిల్ సిద్ధంగా ఉన్నారట. మరి త్వరలో ఈ హిట్ కాంబినేషన్ ఏమైనా సెట్ అవుతుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)