ET 20 : పింక్ దుస్తుల్లో పూజా.. కొత్తింటిలో అన్య‌నా.. మైసూర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌

Entertainment 20 : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు సినిమా క‌బుర్లు మీకోసం

ET 20 : పింక్ దుస్తుల్లో పూజా.. కొత్తింటిలో అన్య‌నా.. మైసూర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌

Top 20 Entertainment News Today On 25 November

మ‌న‌సును హ‌త్తుకుంటున్న హాయ్‌ నాన్న ట్రైల‌ర్..
నాని తండ్రి పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈచిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో..మువీ టీమ్‌ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. రానున్న రెండు రోజుల్లో వరుస ప్రమోషన్స్‌తో హీరో నాని పుల్ బీజీగా గడపనున్నారు. మొదటగా చెన్నై ఆ తర్వాత కొచ్చి‌లో పర్యటించి మూవీ‍ని ప్రమోట్ చేయనున్నారు.

కొత్తింటిలోకి అన్య‌నా పాండే..
బాలీవుడ్ నటి అనన్యా పాండే ఇటీవలే ఓ నూతన గృహంలోకి అడుగుపెట్టారు. తాజాగా తన తన కొత్తింటికి సంబంధించిన ఓ ఫొటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. షారుఖ్ సతీమణి గౌరీఖాన్‌.. తన ఇంటికి ఇంటీరియర్ డిజైనర్‌గా వ్యవహరించారని అనన్యా తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన శ్రుతిహాస‌న్‌..
సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది నటి శ్రుతిహాసన్‌. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. నలుపురంగు చీర ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. శ్రుతిహాసన్‌ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

పింక్ క‌ల‌ర్ దుస్తుల్లో పూజా హెగ్డే..
పింక్ కలర్ దుస్తుల్లో దగదగ మెరిసిపోయింది పూజాహెగ్డే. తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. కొద్దీరోజులుగా గ్యాప్ తీసుకుంది. తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పింక్ కలర్‌ డ్రెస్‌.. హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

అభిమానులు గ‌ర్వ‌ప‌డేలా సినిమా తీస్తా..
‘కేజీఎఫ్‌’ సినిమాలతో గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నటుడు యశ్‌. కేజీఎఫ్-2 తర్వాత నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ గురించి ప్రకటన చేయలేదు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న యశ్‌ తర్వాతి సినిమాపై స్పందించారు. త్వరలోనే అందరూ గర్వపడేలా సినిమా తీస్తా. ఇంకాస్త ఓపిక పట్టండి అని చెప్పారు.

27న కాంతార ఫ‌స్ట్ లుక్‌..
కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్‌ని అందించిన చిత్రం ‘కాంతారా’. రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్‌ చేయడానికి సిద్ధమయ్యాడు.’కాంతారా చాప్టర్ 1′ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్టు రిషబ్‌ శెట్టి ప్రకటించారు. నవంబర్ 27న ‘కాంతారా చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి ఈసారి 5 భాషల్లో కాకుండా 7 భాషల్లో సినిమా విడుదల కానుంది.

ఉక్కుస‌త్యాగ్ర‌హం ట్రైల‌ర్ లాంచ్‌..
పి.సత్యారెడ్డి లీడ్‌ రోల్‌లో నటించి, జనం ఎంటర్‌టైన్మెంట్స్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మిం చిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ సినిమా ట్రైలర్, పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను గద్దర్ కూతురు వెన్నెల లాంచ్ చేశారు.

అదిరిపోయే యాక్ష‌న్ స‌న్నివేశాలు..
గుంటూరుకారం మూవీ‌కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ చక్కర్లుకొడుతోంది. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు వేరే లెవల్‌లో ఉంటాయని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అలాగే స్క్రీన్ ప్లే, సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌పై మేకర్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ రాత్రింబవళ్లు హార్డ్‌ వర్క్‌ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

లేడీరోజ్ రాజకుమారి సాంగ్ విడుద‌ల‌..
కళ్యాణ్‌ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న బ్రిటిష్ స్పై యాక్షన్ డ్రామా డెవిల్ మూవీ నుంచి లేడీరోజ్ రాజకుమారి సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. అమెరికన్ సింగర్ అయిన రాజకుమారి టాలీవుడ్‌లోకి ఈ సాంగ్‌తో ఎంట్రీ ఇస్తున్నారు.

క్రేజీకాంబో రిపీట్‌..
హిట్ కాంబినేషన్లో మరోసారి మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసింది. రామ్, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్‌ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా మణిశర్మ కంటిన్యూ అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్‌కు మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్.. బ్లాక్ బస్టర్ కావడంతో మరోసారి ఈ కాంబినేషన్ మీద ఎక్స్ పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి.

ఈగ‌ల్ కౌంట్ డౌన్ స్టార్ట్‌..
కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది ఈగల్ మూవీ టీమ్‌. రవితేజ, కార్తిక్ కాంబినేషన్‌లో సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈగల్ మూవీ విడుదలకు ఇంకా 50 రోజులే ఉన్నాయి. దీంతో “ఫిఫ్టీ డేస్ టు రిలీజ్” అని పోస్టర్ రిలీజ్‌ చేసి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది మూవీ టీమ్.

విక్రమ్ రాథోడ్ వ‌చ్చేది ఆరోజే..
డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్న విజయ్ ఆంటోనీ.. ఈసారి విక్రమ్ రాథోడ్‌గా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ పవర్‌ ఫుల్ యాక్షన్ డ్రామా విక్రమ్ రాథోడ్ డిసెంబర్ ఒకటిన రిలీజ్ కానుంది.

వివాదానికి పుల్‌స్టాప్‌..
త్రిష విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మన్సూర్.. విపరీతమైన నెగెటివిటీ ఫేస్ చేయడంతో త్రిషకు సారీ చెబుతూ నోట్ రిలీజ్ చేశారు. దీనిపై తాజాగా సోషల్ మీడియా ద్వారా త్రిష కూడా స్పందించారు. తప్పులు చేయడం హ్యూమన్ నేచర్, అలానే వాటిని క్షమించడం అంతకుమించిన గొప్ప విషయం అంటూ త్రిష పోస్ట్ చేశారు.

మైసూర్‌లో గేమ్ ఛేంజ‌ర్‌..
గేమ్‌ ఛేంజర్‌’ కోసం మళ్లీ రంగంలోకి దిగారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాను శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ మైసూర్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం చరణ్‌, సునీల్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అక్క‌గా కీర్తి సురేశ్‌..
‘మహానటి’గా చిత్రపరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ కీర్తి సురేశ్‌.. ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు తన తొలి వెబ్‌సిరీస్‌తో సందడి చేయడానికి ముస్తాబవుతోంది. తాజాగా యష్‌రాజ్‌ ఫిలింస్‌ రూపొందిస్తున్న వెబ్‌సిరీస్‌లో కీర్తిసురేష్‌, రాధికా ఆప్టే కలిసి నటించబోతున్నట్లు సమాచారం. ‘అక్క’ అనే రివేంజ్‌ థ్రిల్లర్‌తో వీరిద్దరి కాంబినేషన్‌ అలరించనుంది.

స‌ల్మాన్‌.. ‘ది బుల్‌’
‘టైగర్‌ 3’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌. దాని తర్వాత తదుపరి చిత్రమేంటనే దానిపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. వీటన్నింటికీ తెర దించుతూ తన తదుపరి సినిమాల విశేషాలు తెలిపారు. ది బుల్‌ అనే చిత్రం చేస్తున్నానని వెల్లడించారు.

ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన వ‌క్కంతం వంశీ..
హీరో రాజశేఖర్‌ ప్రత్యేక పాత్రకు అంగీకరిస్తారనే నమ్మకంతోనే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సినిమాను ప్రారంభించామని చెప్పారు దర్శకుడు వక్కంతం వంశీ. ఆయన్ను కలిసి కథ చెప్పగానే నటించేందుకే అంగీకరించారని పేర్కొన్నారు. నితిన్‌ హీరోగా, శ్రీలీల కథానాయికగా తెరకెక్కిన ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీ మ్యాన్‌’ .. డిసెంబరు 8న సినిమా విడుదల కానుంది.

ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు కొత్త లుక్‌
సుధీర్‌బాబు, మాళవిక శర్మ జంటగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. నిన్న సుధీర్‌ కొత్త లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో ఆయన నిప్పుల కొలిమిలో ఓ ఆయుధాన్ని కాల్చుతూ కనిపించారు. ”1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రమిది. సుధీర్ కొత్త లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర టీజర్‌ను ‘పవర్‌ ఆఫ్‌ సుబ్రమణ్యం’ పేరుతో ఈనెల 27న విడుదల చేయనున్నారు.

టాప్‌టెన్‌లో న‌య‌న‌తార‌..
ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ లిస్ట్‌లో నయన తార టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. రెండు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. తనలోని మరో కొత్త కోణాన్ని వెలికితీసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో నయన ఒక ఫొటో పంచుకుంది.

రాధిక ప్రోమో సాంగ్ రిలీజ్‌..
టాలెంటెడ్‌ యాక్టర్‌ సిద్దు జొన్నలగడ్డ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ టిల్లు 2. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను ఇవాళ విడుదల చేశారు. పూర్తి సాంగ్‌ను ఈ నెల 27న విడుదల చేయనున్నారు.ఈ మూవీని ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు తెలిపారు.