Unstoppable : కృష్ణ-జయప్రద కాంబినేషన్ లో 48 సినిమాలు.. అన్‌స్టాపబుల్ లో కృష్ణ గారికి సంతాపం..

జయసుధ, జయప్రదతో అప్పటి సినిమాల గురించి, అప్పటి నటుల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడారు. జయప్రద మాట్లాడుతూ.. నేను, కృష్ణ గారితో కలిసి దాదాపు 48 సినిమాల్లో నటించాను. మా ఇద్దరిది బిగ్గెస్ట్ కాంబినేషన్...............

Unstoppable : కృష్ణ-జయప్రద కాంబినేషన్ లో 48 సినిమాలు.. అన్‌స్టాపబుల్ లో కృష్ణ గారికి సంతాపం..

tributes to super star Krishna in Unstoppable show

Updated On : December 23, 2022 / 12:36 PM IST

Unstoppable :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు.

జయసుధ, జయప్రదతో అప్పటి సినిమాల గురించి, అప్పటి నటుల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడారు. జయప్రద మాట్లాడుతూ.. నేను, కృష్ణ గారితో కలిసి దాదాపు 48 సినిమాల్లో నటించాను. మా ఇద్దరిది బిగ్గెస్ట్ కాంబినేషన్. సెట్ లో చాలా కామ్ గా ఉండేవారు అని తెలిపింది. జయసుధ కృష్ణ గారి గురించి చెప్తూ.. ఆయనతో నేను తక్కువ సినిమాలే చేశాను. నన్ను ఇండస్ట్రీకి విజయ నిర్మల గారు పరిచయం చేశారు. విజయ నిర్మల, మా నాన్న కజిన్స్. విజయ నిర్మల గారు పరిచయం చేసినా నన్ను కృష్ణ గారే హీరోయిన్ గా గుర్తించారు అని తెలిపింది.

Jayaprada : అడవి రాముడు సినిమా షూట్‌లో ఏనుగుల మీద నుంచి పడిపోయాము..

బాలకృష్ణ కూడా కృష్ణ గారి గురించి, ఆయన చేసిన సినిమాల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అనంతరం కృష్ణ గారి కోసం రెండు నిముషాలు అన్‌స్టాపబుల్‌ సెట్ లో మౌనం పాటించి ఆయనకి నివాళులు అర్పించారు.