Venkatesh : ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ సీక్వెల్ కి రెడీ అంటూ ట్వీట్ చేసిన త్రిష.. వెంకీ మామ ఏమంటాడో?

డైరెక్టర్ సెల్వరాఘవన్.. ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా మళ్ళీ చూశాను. వెంకీ గారు, త్రిషతో వర్క్ చేయడం గొప్ప అనుభవం. దీనికి సీక్వెల్ తీయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని ట్వీట్ చేశారు.

Venkatesh : ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ సీక్వెల్ కి రెడీ అంటూ ట్వీట్ చేసిన త్రిష.. వెంకీ మామ ఏమంటాడో?

Trisha and director Selva Raghavan ready to do Venkatesh Trisha Aadavari Matalaku Arthale Verule Sequel

Updated On : September 11, 2023 / 9:04 AM IST

Venkatesh Trisha : వెంకటేష్, త్రిష జంటగా తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్(Selva Raghavan) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్దాలే వేరులే(Aadavari Matalaku Arthale Verule). 2007లో ఈ సినిమా వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా భారీ విజయం సాధించింది. కామెడీ, లవ్, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు.. అన్ని సమపాళ్లలో ఉండి ప్రేక్షకులని మెప్పించాయి. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అయితే ఇప్పటికి ఎవర్ గ్రీన్ గా మిగిలాయి.

సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ అనుకుంటారని తెలిసిందే. గతంలో ఎప్పుడో 2013 లో డైరెక్టర్ సెల్వరాఘవన్.. ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా మళ్ళీ చూశాను. వెంకీ గారు, త్రిషతో వర్క్ చేయడం గొప్ప అనుభవం. దీనికి సీక్వెల్ తీయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని ట్వీట్ చేశారు. తాజాగా ఈ ట్వీట్ చేసిన పదేళ్ల తర్వాత త్రిష డైరెక్టర్ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ.. నేను రెడీ సీక్వెల్ కి అంటూ పోస్ట్ చేసింది.

Lavanya Tripathi : పెళ్ళికి ముందు ఆ హీరోతో లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్.. చేస్తుందా?

ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా వచ్చిన అయిదేళ్ల తర్వాత డైరెక్టర్ సీక్వెల్ గురించి ట్వీట్ చేస్తే త్రిష ఏకంగా పదేళ్ల తర్వాత ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చింది. దీంతో డైరెక్టర్ సెల్వ రాఘవన్, త్రిష ఇద్దరికీ ఆ సినిమా సీక్వెల్ పై ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. మరి మన వెంకీ మామ ఈ సీక్వెల్ పై ఏమంటాడో చూడాలి.