Trisha Krishnan : సినిమాలు మానేశా.. అతనితో నలుగురు పిల్లల్ని కూడా కన్నా.. త్రిష పోస్ట్ వైరల్
త్రిష పై వచ్చే వార్తలకు అప్పుడపుడు తన సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందిస్తుంది. (Trisha Krishnan)
Trisha quit films married businessman rumors
Trisha Krishnan : ఇటీవల త్రిష ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ కి అతని భార్య విడాకుల నోటీసులు పంపడం, త్రిష విజయ్ తో రిలేషన్ లో ఉందని వార్తలు రావడం, ఈ ఇద్దరూ కలిసి ఒక పెళ్ళిలో కనపడటం, ఈ వ్యాఖ్యల్ని ఇద్దరూ ఖండించకపోవడంతో త్రిష తమిళనాడు మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది.
త్రిష పై వచ్చే వార్తలకు అప్పుడపుడు తన సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందిస్తుంది. తాజాగా త్రిష తన పోస్ట్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల తమిళ నటుడు చిత్రా లక్ష్మణన్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రిష ఇకపై సినిమాలు చేయాలనుకోవట్లేదని, అవకాశాలు వద్దనుకుంటుంది అని చెప్పారు.
Also Read : దురంధర్ డైరెక్టర్ తో ప్రభాస్.. అది కూడా మల్టీస్టారర్.. ఇంకో హీరో ఎవరో తెలుసా..?
దీంతో ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. అవును నేను సినిమాలు మానేశాను. ఒక పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని నలుగురు పిల్లల్ని కూడా కన్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా. ఈ రోజు మీరు వార్తలు రాసుకోవడానికి ఇది చాలా ఇంకేమైనా చెప్పమంటారా అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఆ నటుడు అన్న వ్యాఖ్యలకే సరదాగా త్రిష ఇలా కౌంటర్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇక త్రిష ప్రస్తుతం సూర్య కరుప్పు, చిరంజీవి విశ్వంభర, మలయాళంలో రామ్ అనే సినిమాలు చేస్తుంది.

Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. టైటిల్ రివీల్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్..
