Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. బర్త్ డే స్పెషల్ స్టోరీ..

ఆయన గురించి చెప్పడానికి డిక్షనరీలో పదాలు సరిపోవు, మాట్లాడటానికి మాటలు కూడా అందవు. అంత గొప్ప వ్యక్తి త్రివిక్రమ్. లెక్చరర్ గా చేస్తున్న జాబ్ ని వదిలేసి తన మాటల తూటాలను పేల్చడానికి

Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. బర్త్ డే స్పెషల్ స్టోరీ..

Trivikram

Updated On : November 7, 2021 / 11:06 AM IST

Trivikram :  మనమంతా ఎంటర్టైన్మెంట్ కోసం కాసేపు సినిమాకి వెళ్తాము. కాని ఆయన సినిమాలకి కేవలం మాటల కోసం వెళ్తాము. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ముద్దుగా ఇండస్ట్రీ పిలుచుకునే పేరు గురూజీ. కొన్ని సినిమాలు నవ్విస్తాయి, కొన్ని సినిమాలు ఏడిపిస్తాయి, కొన్ని సినిమాలు ప్రేమని పుట్టిస్తాయి. కాని ఈయన సినిమాలు ఆలోచింపచేస్తాయి. ఆయన కలంతో రాసిన మాటలు మన మెదడులోకి బలంగా దిగుతాయి. చాలా మంది హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. కాని ఆ హీరోలే ఈయనకి ఫ్యాన్స్, ఈయన మాటలకి ఫ్యాన్స్. చచ్చిపోతున్న తెలుగుని తన సినిమాల్లో మాటలతో బతికిస్తాడు. పడిపోతున్న తెలుగు సాహిత్యపు విలువలని తన సినిమాల్లోని పాటలతో విలువలు పెంచుతున్నాడు. ఆయన జ్ఞానం అపారం. ఆయన సినిమాలు అద్భుతం, ఆయన మాటలు అమోఘం.

Anushka Shetty : ప్రభాస్ నిర్మాణంలో అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీ.. బర్త్ డే స్పెషల్ గిఫ్ట్

ఆయన సినిమాల్లో చిలిపిగా మాట్లాడే ప్రేమికులు ఉంటారు. కోపంగా మాట్లాడే విలన్స్ ఉంటారు. భాద్యతగా మాట్లాడే పేరెంట్స్ ఉంటారు. ప్రేమగా మాట్లాడే బంధాలు ఉంటాయి. ఆయన ‘నువ్వే నువ్వే’ కావలి అంటూ వెళ్ళిపోతున్న ప్రేయసి గురించి మాట్లాడతాడు. ‘అతడు’ వచ్చాడంటూ బంధాల విలువలను చూపిస్తాడు. ‘జల్సా’ చేస్తూనే బాధ్యత గల పౌరుడ్ని గుర్తు చేస్తాడు. దేవుడ్ని కాదు నీలో ఉన్న ‘ఖలేజా’ని నమ్ముకోమంటాడు. ‘జులాయి’గా తిరిగే అబ్బాయికి తన తెలివితేటలు మంచికి వాడమని చెప్తాడు. విడిపోయిన బంధాలను కలపడానికి ‘అత్తారింటికి దారేది’ అంటూ పరుగులు తీయిస్తాడు. ‘s/o సత్యమూర్తి’ అని నాన్న బాధ్యతని మనతో మోయిస్తాడు. ‘అఆ’లు నేర్పిస్తూ అమ్మని, అమ్మాయిల్ని ఎలా మేనేజ్ చేయాలో చెప్తాడు. ‘అజ్ఞాతవాసి’ అంటూ కనపడని రాజులని పరిచయం చేస్తాడు. ఊళ్ళల్లో జరిగే గొడవలు ఆపడానికి ‘అరవింద సమేత వీరరాఘవ’లా ప్రమాణం చేయిస్తాడు. రాజు ఎక్కడున్నా రాజులాగే ఉంటాడు అని ‘అల వైకుంఠపురంలో’ నివసించేలాగా చేస్తాడు.

Food Delivery : స్విగ్గిలో ఫుడ్ లేట్ గా వచ్చినందుకు మోడీకి, మమతా బెనర్జీకి ట్విట్టర్లో కంప్లైంట్ చేసిన స్టార్ హీరో

ఇక ఆయన స్పీచ్ లు ఒక్కోటి ఒక్కో వజ్రం. సినిమా ఫంక్షన్స్ లో ఆయన స్పీచ్ మాట్లాడుతుంటే అలాగే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆయన స్పీచ్ లను ఎన్నో సార్లు రిపీట్ మోడ్ లో విని ఉంటాం. ఆయన స్పీచ్ వింటుంటే మనలో తెలియని ఉత్సాహంతో పాటు ఏదైనా సాధించాలనే కసి కూడా మొదలవుతుంది. ఇలా ఎంతో మందిని మోటివేట్ చేసే త్రివిక్రమ్ పుట్టిన రోజు నేడు.

Puneeth Rajkumar : పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ప్రేమ జంట.. అడ్డుకున్న పోలీసులు

ఆయన గురించి చెప్పడానికి డిక్షనరీలో పదాలు సరిపోవు, మాట్లాడటానికి మాటలు కూడా అందవు. అంత గొప్ప వ్యక్తి త్రివిక్రమ్. లెక్చరర్ గా చేస్తున్న జాబ్ ని వదిలేసి తన మాటల తూటాలను పేల్చడానికి హైదరాబాద్ వచ్చి సీరియల్స్, సినిమాలు అంటూ ఎన్నో వాటికి రైటర్ గా పని చేసి దర్శకుడిగా అవతారం ఎత్తి ఎన్నో మంచి సినిమాలని మనకు అందించి మరెన్నో సినిమాలను మన ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు త్రివిక్రమ్.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఎవరు హీరో ? ఎవరు విలన్?

ప్రస్తుతం మహేష్ బాబుతో హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో సినిమా తీయబోతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా షూట్ మొదలవ్వబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.