Samantha: అల్లు అర్జున్‌పై సమంత ప్రశంసల వర్షం

ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ దూసుకుపోతున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Samantha: అల్లు అర్జున్‌పై సమంత ప్రశంసల వర్షం

Samantha

Updated On : December 20, 2021 / 9:27 PM IST

Samantha: ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ దూసుకుపోతున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.. తగ్గేదే లే అంటూ… పుష్ప కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తోంది. మూడు రోజులకే 173 కోట్ల రూపాయలు గ్రాస్‌ సాధించి రికార్డు సృష్టించింది. వీకెండ్ ముగిసిన తర్వాత కూడా పుష్ప సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ రష్‌ కంటిన్యూ అవుతోంది.

తొలి రోజు 71 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ సాధించిన పుష్ప…రెండో రోజుకు మొత్తం 116 కోట్ల గ్రాస్‌ సాధించింది. మూడోరోజైన ఆదివారం కూడా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవడంతో 173 కోట్ల రూపాయల గ్రాస్‌ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి వరల్డ్ వైడ్ రిలీజైన పుష్ప మూవీ ఆడియన్స్‌ను అలరిస్తోంది.

‌సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూపించారు. ఈ సంధర్భంగా అల్లు అర్జున్‌పై నటి సమంత ప్రశంసల వర్షం కురిపించారు. ‘పుష్ప’రాజ్‌గా బన్నీ అదరగొట్టేశారని, నటుల్లో స్ఫూర్తి నింపారని అభిప్రాయపడ్డారు. చిత్తూరు యాస, భుజాన్ని పైకి పెట్టే మేనరిజం.. ప్రతి ఫ్రేమ్‌లోనూ బన్నీ అదరగొట్టేశారని అన్నారు సమంత.

సమంత ఈ సినిమాలో ఊ అంటవా అంటూ ఓ పాటలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.