Aha-Netflix: ఓటీటీలో వచ్చేసిన మరో రెండు సినిమాలు..!
కరోనా పోయి పూర్తిగా జన కార్యకలాపాలన్నీ సజావుగా సాగుతున్నా ఓటీటీలకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. కరోనా కారణంగా వాయిదాపడ్డ సినిమాలన్ని ఇప్పుడు పరిస్థితిలు చక్కబడి థియేటర్లు..
Aha-Netflix: కరోనా పోయి పూర్తిగా జన కార్యకలాపాలన్నీ సజావుగా సాగుతున్నా ఓటీటీలకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. కరోనా కారణంగా వాయిదాపడ్డ సినిమాలన్ని ఇప్పుడు పరిస్థితిలు చక్కబడి థియేటర్లు తెరుచుకున్నప్పటి నుంచి పోటీ పడి మరీ రిలీజ్ అవుతున్నాయి. అయితే అదే టైంలో ప్రతి వారం కనీసం మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ బరిలో నిలుస్తుడడంతో ఏ సినిమా కూడా బాక్సాఫీసు బరిలో ఎక్కువ కాలం నిలబడడం లేదు. అందుకే, ఓటీటీలో కూడా రిలీజ్ కు భారీ డిమాండ్ నెలకొంటుంది.
RRR: ఆర్ఆర్ఆర్@4 ఏళ్ళు.. ఇన్ని రోజులు ఏం చేశారు?
దాదాపుగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైన నెలరోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంటే.. మరికొన్ని సినిమాలు మాత్రం పది రోజులకే ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా రెండు తెలుగు సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో కూడా అచ్చ తెలుగు ఓటీటీగా పేరుతెచ్చుకున్న ఆహా ఎక్కడ మంచి కంటెంట్ ఉంటే అక్కడ వాలిపోతుంది. ఇప్పటికే ఎన్నో స్టార్ సినిమాలను తీసుకొచ్చిన ఆహా ఇప్పుడు అక్కినేని యువహీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తీసుకొచ్చింది.
Tollywood Directors: డైరెక్టర్లు రెడీ.. స్టార్ హీరోల సినిమాలు స్టార్టయ్యేదెప్పుడు?
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించి థియేటర్ రిలీజ్ లో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఆహా వీడియో, నెట్ఫ్లిక్స్లో గురువారం అర్ధరాత్రి నుండి ఒకేసారి స్ట్రీమింగ్ కి రాగా.. మరో యువ నటుడు తేజ సజ్జ, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘అద్బుతం’ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలో ప్రీమియర్ స్ట్రీమింగ్ జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ ఇంట్లో నుండే తాపీగా ఈ సినిమాలు చూసేయండి!