Ugly Story : ‘అగ్లీ స్టోరీ’ టీజర్ రిలీజ్.. బాబోయ్ నందు అరాచకం..
అగ్లీ స్టోరీ టీజర్ మీరు కూడా చూసేయండి.. (Ugly Story)

Ugly Story
Ugly Story : నందు, అవికా గోర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘అగ్లీ స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మాణంలో ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజవ్వగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు.(Ugly Story)
అగ్లీ స్టోరీ టీజర్ మీరు కూడా చూసేయండి..
ఈ టీజర్ చూస్తుంటే.. హీరో ఓ అమ్మాయిని ప్రేమించినట్టు, ఆమెని ప్రేమ అని ఇబ్బంది పెట్టినట్టు, ఆమె వేరేవాళ్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా ఇంకా ప్రేమ అని వెంటపడుతున్నట్టు చూపించారు. ఇందులో నందు నెగటివ్ షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్లోనే తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు నందు. ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్న అవికా గోర్ పెళ్లి తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.