బాలకృష్ణ ‘అన్‌‌‌‌స్టాపబుల్’ సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌‌‌‌ గ్లింప్స్‌ వచ్చేసింది..

ఆకాశంలో సూర్య, చంద్రులు.. ఏపీలో బాబు, కల్యాణ్ బాబు అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి బాలకృష్ణ అన్నారు. 

బాలకృష్ణ ‘అన్‌‌‌‌స్టాపబుల్’ సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌‌‌‌ గ్లింప్స్‌ వచ్చేసింది..

Updated On : October 22, 2024 / 12:18 PM IST

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌‌‌‌స్టాపబుల్’ సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌‌‌‌ గ్లింప్స్‌ వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌కి అతిథిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లు సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ అయిన విషయం తెలిసిందే.

ఫస్ట్ ఎపిసోడ్‌లో చంద్రబాబు, బాలకృష్ణ సరదాగా మాట్లాడుకున్నారు. ఆకాశంలో సూర్య, చంద్రులు.. ఏపీలో బాబు, కల్యాణ్ బాబు అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి బాలకృష్ణ అన్నారు. రాజకీయాలకు సంబంధించిన విషయాలు బాగానే మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

“మీరు ఎలాగైతే ఇక్కడ అన్‌స్టాపబుల్‌గా ఉన్నారో.. నేను కూడా రాజకీయాల్లో అలాగే అన్‌స్టాపబుల్‌గా ఉంటాను” అని చంద్రబాబు నాయుడు బాలకృష్ణతో చెప్పారు. కాగా, మూడు సీజన్లు పూర్తి చేసుకున్న‘అన్‌‌‌‌స్టాపబుల్’ నాలుగో సీజన్‌‌‌‌ ఫస్ట్ ఎపిసోడ్‌‌‌‌ షూట్‌‌‌‌ ఆదివారం తీసిన విషయం తెలిసిందే. రాజకీయంతో పాటు వినోదం కలబోసి తొలి ఎపిసోడ్‌ను నడిపించారు.

పవన్ కల్యాణ్‌తో చంద్రబాబుకి అంతటి స్నేహ బంధం ఏర్పడింది? పవన్‌తో స్నేహం గురించి చంద్రబాబు ఏం చెప్పారు? పొత్తు కుదిరే ముందు చంద్రబాబుకి పవన్ కల్యాణ్ ఏమి చెప్పారు? ఆ వ్యాఖ్యలు చంద్రబాబు ఎలా ఆకర్షించాయి? అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ ఎపిసోడ్‌లో దొరకనుంది. ఈ ఎపిసోడ్‌ ఈ నెల 25న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.