Upasana : యువ మహిళలలకు ఉపాసన అదిరిపోయే ఆఫర్.. మీ బిజినెస్‌లలో నేను పెట్టుబడులు పెడతాను..
తాజాగా ఉపాసన యువ మహిళలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
Upasana : ఉపాసన రామ్ చరణ్ భార్యగానే కాక అపోలో సంస్థల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. అపోలోలో కీలక బాధ్యతలు పోషిస్తూ అపోలోని విస్తరించడమే కాక, మరి కొన్ని కొత్తరకాల బిజినెస్ లు ప్రారంభించి, పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా ఉపాసన హెల్త్ కేర్ రంగంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తాజాగా ఉపాసన యువ మహిళలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
ఉపాసన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో ఓ ఈవెంట్లో పాల్గొనగా అక్కడ మాట్లాడుతూ.. ఎవరైతే హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలనుకుంటున్నారో అలాంటి యువ మహిళల కోసం నేను చూస్తున్నాను. నేను మీ కో ఫౌండర్ అవుతాను, నేను మీ పార్ట్నర్ అవుతాను. మేము మీకు హెల్ప్ చేస్తాము ఇండియాలో హెల్త్ కేర్ సిస్టంని చేంజ్ చేయడానికి అని తెలిపింది.
Also Read : Sneha – Pawan Kalyan : రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా.. పవన్ పై స్నేహ వ్యాఖ్యలు..
ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా? మహిళలు ఎదిగేందుకు, అభివృద్ధి చెందేందుకు వ్యవస్థని నిర్మించడానికి నాతో చేతులు కలపండి. మీ బిజినెస్ పర్పస్, మీ బిజినెస్ ఎవరిపై ప్రభావం చూపుతుంది. మీ బిజినెస్ మన ప్లానెట్ కి ఎలాంటి పాజిటివిటీని ఇస్తుంది, నన్ను మీరు కో ఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారు వంటి వివరాలను cofounder@urlife.co.in వెబ్ సైట్ లో సబ్మిట్ చేయండి అని తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం యువ మహిళలు హెల్త్ కేర్ రంగంలో రాణించాలనుకుంటే మీ ఆలోచనలతో ఉపాసనను కాంటాక్ట్ అవ్వండి.