Upasana Konidela : మా ఫ్యామిలీలో ఇద్దరు పద్మవిభూషణులు ఉండటం గర్వంగా ఉంది.. ఉపాసన ట్వీట్

తమ ఫ్యామిలీలో ఇద్దరు పద్మవిభూషణలున్నారంటూ ఉపాసన సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. తన తాతగారు-మామగార్ల ఫోటోను షేర్ చేసారు.

Upasana Konidela  : మా ఫ్యామిలీలో ఇద్దరు పద్మవిభూషణులు ఉండటం గర్వంగా ఉంది.. ఉపాసన ట్వీట్

Upasana Konidela

Updated On : January 27, 2024 / 2:39 PM IST

Upasana Konidela : మెగా కోడలు ఉపాసన తన మామగారికి పద్మవిభూషణ్ రావడం పట్ల సంబరపడిపోతున్నారు. గతంలో తన తాతగారైన డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి  కూడా పద్మవిభూషణ్ అందుకున్నారు. తమ కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణలుండటం గర్వంగా ఉందని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Upasana : మనవరాళ్లతో మెగాస్టార్.. ఫొటోలో ఇది గమనించారా? ఉపాసన స్పెషల్ పోస్ట్..

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ అవార్డులు ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డు వరించింది. దేశంలోనే రెండో గొప్ప పౌర సత్కారం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. చిరంజీవి పద్మవిభూషణ్ అందుకోవడం దేశ ప్రజలకే సంబరంగా ఉంటే ఆయన కుటుంబ సభ్యుల ఆనందం మాటల్లో చెప్పలేం. చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైనట్లు ప్రకటన రాగానే ఉపాసన ‘కంగ్రాట్స్ డియరెస్ట్ మావయ్యా’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి సంతోషం వ్యక్తం చేశారు.

Upasana : చరణ్ విజయం వెనుక నేను కాదు.. నాకు సపోర్ట్‌గా చరణ్.. ఉపాసన కామెంట్స్..

ఉపాసన తాతగారైన అపోలో హాప్సిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఆయన అందించిన సేవలకు గాను 2010 లో పద్మవిభూషణ్ అందుకున్నారు. తాజాగా తన మావగారు పద్మవిభూషణ్ సాధించడంతో ఉపాసన సంబరంలో మునిగి తేలుతున్నారు. తమ కుటుంబంలలో ఇద్దరు పద్మవిభూషణలుండటం గర్వంగా, గౌరవంగా ఉందని ఉపాసన తాజాగా మరో ట్వీట్ చేసారు. తన తాతగారు, మామగారు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ పోస్టు చేసారు. 68 సంవత్సరాల వయస్సులో మెగాస్టార్ అదే నటన.. అదే సామాజిక సేవ స్ఫూర్తితో ముందుకు నడుస్తుంటే.. 91 ఏళ్ల వయసులో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తమ సంస్థల ద్వారా ప్రజారోగ్యానికి పాటుబడటంతో పాటు మానవతావాదిగా ముందుకు సాగుతున్నారు. అందుకే వీరిద్దరిని పద్మవిభూషణ్ వరించిందన్నది వాస్తవం.