Upasana : అమెరికన్ ఫేమస్ డాక్టర్‌ని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వమంటున్న ఉపాసన.. ఎందుకు?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నాడు. మర్చి 13న జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రామ్ చరణ్..

Upasana : అమెరికన్ ఫేమస్ డాక్టర్‌ని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వమంటున్న ఉపాసన.. ఎందుకు?

Upasana requests to join American famous doctor in Apollo Hospital

Updated On : February 28, 2023 / 4:56 PM IST

Upasana : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నాడు. మర్చి 13న జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రామ్ చరణ్.. యూఎస్ లోని పాపులర్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా కి గెస్ట్ గా వెళ్ళాడు. ఆ టాక్ షోలో అమెరికన్ ఫేమస్ డాక్టర్ జెన్నిఫర్ ఆష్‌టన్ కూడా పాల్గొంది. కాగా ఈ షోలో ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి తీసుకు వచ్చింది.

Upasana : మాకు పుట్టబోయే పిల్లల్ని అలానే పెంచుతాం.. ఉపాసన!

ఈ క్రమంలోనే ఆమె రామ్ చరణ్‌తో.. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా అంటూ కామెంట్ చేసింది. కాగా ఈ వ్యాఖ్యలు పై ఉపాసన స్పందిస్తూ.. ”డాక్టర్ జెన్నిఫర్ ఆష్‌టన్ మీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. మిమ్మల్ని కలవడానికి నేను ఎదురు చూస్తున్నా. మా ఫస్ట్ బేబీని డెలివరీ చేయడానికి మీరు అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వచ్చుగా” అంటూ రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. మరి మెగా వారసుడిని ఎవరు డెలివరీ చేస్తారో చూడాలి.

కాగా రామ్ చరణ్ నిన్న (ఫిబ్రవరి 25) హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో పాల్గొన్నాడు. ఈ అవార్డ్స్ లో చరణ్ ప్రజెంటర్ గా వ్యవహరించాడు. ఈ ఘనత అందుకున్న మొదటి ఇండియన్ సెలెబ్రెటీగా రామ్ చరణ్ రికార్డు సృష్టించాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆస్కార్ రేస్ లో నాటు నాటు తో పాటు ఉన్న లిఫ్ట్ మీ అప్, అప్లాజ్ సాంగ్స్ ని ప్రదర్శిస్తుండగా, నాటు నాటు కూడా పర్ఫర్మ్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది.