Urfi Javed : అందుకే నాకెవ్వరూ ఇల్లు అద్దెకు ఇవ్వట్లేదు.. ఉర్ఫీ జావేద్ ఆవేదన..

తాజాగా ఉర్ఫీ జావేద్ తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఉర్ఫీ జావేద్ తన ట్విట్టర్లో.. ముస్లిం యజమానులు నేను దుస్తులు ధరించే విధానం వల్ల నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడరు, ఇక నేను ముస్లిం కాబట్టి.............

Urfi Javed : అందుకే నాకెవ్వరూ ఇల్లు అద్దెకు ఇవ్వట్లేదు.. ఉర్ఫీ జావేద్ ఆవేదన..

Urfi Javed says no one gives a house for rent to me in Mumbai

Updated On : January 26, 2023 / 10:53 AM IST

Urfi Javed :  హిందీ బిగ్ బాస్ తో బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్ ఆ తర్వాత తన విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది. కాదేది వస్త్రధారణపై అనర్హం అంటూ చిత్రచిత్రాల డ్రెస్సులు, రకరకాల వస్తువులతో డ్రెస్సులు, బ్లేడ్లు, కవర్లు, గోనె సంచులు, సిమ్ కార్డులు, తాళ్లు… ఇలా రకరకాల వస్తువులతో డ్రెస్సులు వేస్తూ బాగా ఫేమస్ అయింది. అయితే కేవలం ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కప్పుకుంటూ మిగతా శరీరం అంతా కనపడేలా చాలా బోల్డ్ గా బట్టలు వేసుకొని, అలాగే రోడ్ల మీదకి, జనాల్లోకి రావడంతో వైరల్ అవ్వడంతో పాటు వివాదాల్లో కూడా నిలిచింది.

ఉర్ఫీ జావేద్ విచిత్ర బోల్డ్ వేషధారణతో పలువురికి ఇబ్బంది కలుగుతున్నా తను మాత్రం మారట్లేదు. దీంతో చాలా మంది ఆమెని హెచ్చరించారు, ఆమెపై పోలీసు కేసులు పెట్టారు, ఆమెని బెదిరించారు. రోజురోజుకి తను ఈ వివాదాలతో కూడా బాగా పాపులర్ అవుతుంది. ఇక ఇవి చాలవన్నట్టు ఆమె సోషల్ మీడియాలో పెట్టె పోస్టులతో మరిన్ని వివాదాల్లో, వార్తల్లో నిలుస్తుంది.

Satya Dev : కన్నడ స్టార్ హీరోతో కలిసి సత్యదేవ్ మల్టీస్టారర్.. టైటిల్ కొత్తగా ఉందే..

తాజాగా ఉర్ఫీ జావేద్ తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఉర్ఫీ జావేద్ తన ట్విట్టర్లో.. ముస్లిం యజమానులు నేను దుస్తులు ధరించే విధానం వల్ల నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడరు, ఇక నేను ముస్లిం కాబట్టి హిందూ యజమానులు నాకు అద్దెకు ఇవ్వరు. నాకు వచ్చిన రాజకీయ బెదిరింపులతో కొంతమంది భయపడి నాకు ఇల్లు రెంట్ కి ఇవ్వరు. మొత్తానికి నాకు ముంబైలో అద్దె అపార్ట్‌మెంట్‌ దొరకడం చాలా కష్టంగా ఉంది అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.