Ustaad Bhagat Singh : పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్.. హరీష్ శంకర్ స్పెషల్ పోస్ట్..

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి హరీష్ శంకర్ అప్డేట్ ఇచ్చారు. ఓ క్లాప్ బోర్డు, హరీష్ శంకర్(Harish Shankar) క్యాప్ ఉన్న ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేస్తూ..

Ustaad Bhagat Singh : పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్.. హరీష్ శంకర్ స్పెషల్ పోస్ట్..

Ustaad Bhagat Singh Movie Update by Director Harish Shankar

Updated On : September 30, 2023 / 2:07 PM IST

Ustaad Bhagat Singh : రాజకీయ షెడ్యూల్స్ మధ్య పవన్ సినిమా షూటింగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వారాహి మూడో యాత్ర అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎప్పట్నుంచో షూటింగ్ వాయిదా పడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా షూటింగ్ కి డేట్స్ ఇచ్చారు. దీంతో గత రెండు వారాలుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగింది. అయితే మధ్యలో చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో పవన్ మళ్ళీ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో కొన్ని రోజులు ఆగిన షూటింగ్ మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మొదలుపెట్టారు.

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి హరీష్ శంకర్ అప్డేట్ ఇచ్చారు. ఓ క్లాప్ బోర్డు, హరీష్ శంకర్(Harish Shankar) క్యాప్ ఉన్న ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేస్తూ.. సినిమాలో చాలా ఇంపార్టెంట్, ఇంటెన్స్ ఉన్న షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసి షెడ్యూల్ ప్యాకప్ చెప్పాము. పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉండండి అని పోస్ట్ చేశారు.

Also Read : Prithviraj Sukumaran : మూడు నెలల తర్వాత యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో.. రోజుకి 9 గంటలు ఫిజియోథెరపీ..

దీంతో ఇన్నాళ్లు వాయిదా పడిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఫాస్ట్ గా షూటింగ్ జరుగుతుందని పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు. వారాహి యాత్ర నాలుగో విడత మొదలు పెడుతుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ నుంచి బాయ్ చెప్పి నేడు మంగళగిరి వెళ్తున్నారు. ఈ వారాహి యాత్ర అయ్యాక మళ్ళీ సినిమాలకి డేట్స్ ఇవ్వనున్నారు. ఇలా ఖాళీ లేకుండా ఇటు అభిమానుల కోసం సినిమాలు, అటు ప్రజల కోసం పాలిటిక్స్ అంటూ కష్టపడుతున్నాడని అభిమానులు పవన్ పై ఎప్పటిలాగే ప్రశంసలు కురిపిస్తున్నారు.