Viashnav Tej : అన్నయ్య, బావని పెట్టి మల్టీస్టారర్.. త్వరలో డైరెక్షన్ చేస్తా అంటున్న మెగా హీరో..

ఈ ఇంటర్వ్యూలో వైష్ణవ్ ఓ ఆసక్తికర విషయాన్నీ తెలియచేశారు. వైష్ణవ్ మాట్లాడుతూ.. ''భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాను. కొన్ని రోజులు యాక్టింగ్ ఆపేసి డైరెక్షన్ మీద కాన్సంట్రేట్ చేస్తాను. ఆల్రెడీ కథ రాసుకున్నాను...................

Viashnav Tej : అన్నయ్య, బావని పెట్టి మల్టీస్టారర్.. త్వరలో డైరెక్షన్ చేస్తా అంటున్న మెగా హీరో..

Vaishnav Tej announce direction a multistarrer with saidharam and varun tej

Updated On : August 29, 2022 / 12:53 PM IST

Viashnav Tej :  గతంలో కొంతమంది హీరోలు దర్శకత్వం చేశారు. వేరే భాషల్లో కూడా చాలా మంది హీరోలు దర్శకత్వం చేస్తున్నారు. మన టాలీవుడ్ లో కూడా కొంతమంది హీరోలు దర్శకత్వం వైపు అడుగులు వేయడానికి ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే మెగా హీరో పవన్ కళ్యాణ్ జానీ సినిమాతో దర్శకుడిగా మారారు. ఇప్పుడు మరో మెగా హీరో కూడా త్వరలో డైరెక్షన్ చేస్తానంటున్నాడు.

ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ తేజ్ త్వరలో రంగరంగ వైభవంగా సినిమాతో రాబోతున్నాడు. వైష్ణవ తేజ్, కేతిక శర్మ జంటగా కొత్త దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో ఈగో, లవ్ కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమా రంగరంగ వైభవంగా. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాని సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు వైష్ణవ్, కేతికలతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

Sharwanand : పెద్ద యాక్సిడెంట్ అయింది.. రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని నన్ను నేను తక్కువ చేసుకోలేను..

ఈ ఇంటర్వ్యూలో వైష్ణవ్ ఓ ఆసక్తికర విషయాన్నీ తెలియచేశారు. వైష్ణవ్ మాట్లాడుతూ.. ”భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాను. కొన్ని రోజులు యాక్టింగ్ ఆపేసి డైరెక్షన్ మీద కాన్సంట్రేట్ చేస్తాను. ఆల్రెడీ కథ రాసుకున్నాను. మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాను. అన్నయ్య సాయి ధరమ్ తేజ్, బావ వరుణ్ తేజ్ లతో మల్టీస్టారర్ తీయాలనుకుంటున్నాను. త్వరలోనే ఆ సినిమా వస్తుంది” అని తెలిపాడు. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ డైరెక్షన్ చేస్తాననడంతో, అది కూడా ఇద్దరు మెగా హీరోలని పెట్టి మల్టీస్టారర్ అని చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.