Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారా.. నిజమేనా..?

పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్.

Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారా.. నిజమేనా..?

Vaishnav Tej PV04 Movie Title Locked

Vaishnav Tej: మెగా కాంపౌండ్ నుండి ‘ఉప్పెన’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నాడు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నా, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు ఈ హీరో. వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌లోని నాలుగవ చిత్రాన్ని ఇటీవల స్టార్ట్ చేశాడు. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.

Vaishnav Tej: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా హీరో మూవీ!

ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ మూవీపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా, మరో బ్యూటీ అపర్ణా దాస్ ‘వజ్ర కాళేశ్వరి దేవి’ అనే ఇంట్రెస్టింగ్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ రీసెంట్‌గా అనౌన్స్ చేసింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఆదికేశవ’ లేదా ‘ముక్కంటి’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Vaishnav Tej : కళ్యాణ్ మామయ్య ‘బద్రి’ సినిమా రీమేక్‌లో నటించాలనుంది..

ఈ రెండు టైటిల్స్‌లో ఏదో ఒక టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకే మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి నిజంగానే ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేశారా.. చేస్తే ఎలాంటి టైటిల్‌తో వైష్ణవ్ మనముందుకు వస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.