Vaishnavi Chaitanya : హీరోయిన్ అయిన తర్వాత మొదటి దీపావళి సెలబ్రేషన్స్.. ‘బేబీ’ వైష్ణవి తమ్ముడితో కలిసి..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి హీరోయిన్ గా నటించిన ‘బేబీ’(Baby) సినిమా భారీ విజయం సాధించి ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో వైష్ణవి హీరోయిన్ గా మొదటి సినిమాతోనే స్టార్ అయిపొయింది.

Vaishnavi Chaitanya Celebrated First Diwali after Baby Movie Success
Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో మరింత పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటనకి, అందానికి అంతా ఫిదా అయ్యారు. సిరీస్ లు చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అల్లు అర్జున్, నాని, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో వైష్ణవి చైతన్య నటించి మెప్పించింది.
తెలుగమ్మాయి అవ్వడంతో పాటు బాగా నటించడంతో వైష్ణవికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే ఇటీవల బేబీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి హీరోయిన్ గా నటించిన ‘బేబీ’(Baby) సినిమా భారీ విజయం సాధించి ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో వైష్ణవి హీరోయిన్ గా మొదటి సినిమాతోనే స్టార్ అయిపొయింది.
Also Read : Shruti Haasan : పెళ్ళికి ముందే బాయ్ ఫ్రెండ్‌తో కలిసి.. ట్రెడిషినల్‌గా శృతి హాసన్ దీపావళి సెలెబ్రేషన్స్..
ఈ సినిమా తర్వాత వైష్ణవి ఇప్పుడు ఫుల్ బిజీ అయింది. హీరోయిన్ గా మూడు సినిమాల్లో నటిస్తుంది. ఇక హీరోయిన్ అయి, బేబీ సక్సెస్ తర్వాత మొదటి దీపావళి రావడంతో తన తమ్ముడితో కలిసి ఇంటివద్ద గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పట్టుచీరలో, దీపావళి టపాసుల వెలుగుల్లో మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది వైష్ణవి.