Aadi Keshava : ఆదికేశవగా వైష్ణవ తేజ్ రుద్ర తాండవం..
వైష్ణవ తేజ్ నటిస్తున్న 4వ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో వైష్ణవ మాస్ యాక్షన్..

Vaisshnav Tej 4th titled as Aadi Keshava and glimpse released
Vaisshnav Tej Aadi Keshava : మెగా హీరో వైష్ణవ తేజ్ (Panja Vaisshnav Tej) నటిస్తున్న తాజా చిత్రం PVT04. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. తరువాత రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసేలా తన నాలుగో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు రెండు పోస్టర్ లు రిలీజ్ చేసిన మూవీ టీం తాజాగా.. టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
Ram Charan : ముంబైలో 1000 మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్.. దాదాపు తొమ్మిది వేల మందికి సేవ!
PVT04 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ‘ఆదికేశవ’ టైటిల్ ని ఖరారు చేశారు. ఇక గ్లింప్స్ లో వైష్ణవ తేజ్ పక్కా మాస్ అవతారంలో కనిపించి అదరగొట్టేశాడు. మైనింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని గ్లింప్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఆ మైనింగ్ చేస్తూ శివుడి గుడిని కూడా విలన్స్ కూల్చడానికి ట్రై ప్రయత్నిస్తుంటే హీరో వాళ్ళని అడ్డుకోవడమే సినిమా కథ అని తెలుస్తుంది.
Balakrishna : చిరు దర్శకుడితో బాలయ్య సినిమా.. నిజమేనా?
ఇక ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ (Joju George) విలన్ కనిపించబోతున్నాడు. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్త నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. కొత్త విడుదల తేదీన అనౌన్స్ చేయనున్నారు