Valimai: వలిమై ప్రభంజనం.. 7 రోజుల్లో 500 మిలియన్ల ట్రీమింగ్ మినిట్స్!
కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ నిర్మాణంలో దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించిన సినిమా ‘వలిమై’..
Valimai: కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ నిర్మాణంలో దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించిన సినిమా ‘వలిమై’. అజిత్ నటించిన 60వ సినిమా ఇది కాగా.. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నెగటివ్ రోల్ లో నటించాడు. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి ఫీమేల్ లీడ్ చేయడం మరో అట్రాక్షన్ కాగా.. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు కానీ తమిళనాట రికార్డు వసూళ్లను రాబట్టింది.
Valimai: ఓటీటీలో వలిమై రికార్డ్.. 24 గంటల్లో 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్!
మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా.. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కరోనా తర్వాత వందకోట్లు కొల్లగొట్టిన తొలి తమిళ్ సినిమాగా కోలీవుడ్ కు బూస్టప్ ఇచ్చింది వలిమై. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించిన వలిమై ఈ నెల 25 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డులను నమోదు చేస్తుంది.
Valimai: రూ.100 కోట్ల క్లబ్లో వలిమై.. ఆల్ టైమ్ రికార్డులను సెట్ చేస్తున్న అజిత్
ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన తొలి 24 గంటల్లోనే వలిమై 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ని పూర్తి చేసుకుని రికార్ నెలకొల్పగా.. 7 రోజుల్లోనే 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ తాజాగా డిజిటల్ రంగంలో రికార్డ్ సృష్టిస్తుంది. జీ5లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని తెలుస్తుంది. థియేటర్లలో సక్సెస్ కాలేకపోయినా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతూ వ్యూస్ దక్కించుకుంటున్నాయి.