Vanitha: నా గుండె బద్ధలైపోయింది.. సినీనటి ఎమోషనల్ పోస్ట్!

ప్రముఖ సినీనటి వనితా విజయ్‌కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది.

Vanitha: నా గుండె బద్ధలైపోయింది.. సినీనటి ఎమోషనల్ పోస్ట్!

Vanitha

Updated On : October 15, 2021 / 5:29 PM IST

Vanitha: ప్రముఖ సినీనటి వనితా విజయ్‌కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది. ఈ విషయాన్ని వనితానే తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ‘ఉదయాన్నే ఓ విషాదకర వార్త వింటూ లేచాను.. ఇరవై ఏళ్ల వయసున్న కూతురు(అక్క కూతురు) అనిత చనిపోయింది.

న్యూఢిల్లీలో సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమెకు గుండెపోటు వచ్చింది. నాకు దేవుడిచ్చిన కూతురు తుది శ్వాస విడిచింది. మా నాన్న విజయ్ కుమార్ సొంత సోదరుడి కూతురు ఇంద్ర కూతురే అనిత. ఇంద్ర అక్క మా ఫ్యామిలీకి పెద్ద.. నాకు ఇంద్ర అంటే చాలా ఇష్టం. నాకు కష్టం వస్తే ఆమె చాలా సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఆమెకు కష్టం వచ్చింది.’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది వనితా విజయ్ కుమార్.

కరోనా లాక్ డౌన్ కంటే ముందు నుంచి కలుద్దామని ప్లాన్ చేస్తున్నాం.. కుదరలేదు.. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. నా గుండె బద్ధలైపోయింది. మాటలు రావటలేదు.. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను స్వీట్ హార్ట్.. అతన్, అంజన కోసమైన స్ట్రాంగ్ గా ఉండాలి. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది వనితా విజయ్ కుమార్.

 

View this post on Instagram

 

A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar)