Karthika Deepam : వంటలక్క ఫ్యాన్స్‌కి షాక్.. ‘కార్తీక దీపం’కి గుడ్‌‌బై చెప్పేసిన వంటలక్క, డాక్టర్ బాబు

తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిలించినా వంటలక్క, డాక్టర్ బాబు అంటే ఈజీగా చెప్పేస్తారు. తెలుగు బుల్లితెరపై ఈ క్యారెక్టర్స్ తో వచ్చిన 'కార్తీక దీపం' సీరియల్ ప్రేక్షకులకి బాగా..........

Karthika Deepam : వంటలక్క ఫ్యాన్స్‌కి షాక్.. ‘కార్తీక దీపం’కి గుడ్‌‌బై చెప్పేసిన వంటలక్క, డాక్టర్ బాబు

Karthika Deepam

Updated On : March 12, 2022 / 2:10 PM IST

 

Karthika Deepam :  తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిలించినా వంటలక్క, డాక్టర్ బాబు అంటే ఈజీగా చెప్పేస్తారు. తెలుగు బుల్లితెరపై ఈ క్యారెక్టర్స్ తో వచ్చిన ‘కార్తీక దీపం’ సీరియల్ ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ప్రతి ఇంట్లో ఈ సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సీరియల్ టెలివిజన్ ని రూల్ చేస్తుంది. అన్ని ఛానల్స్ లో, అన్ని షోల కంటే కూడా ఎక్కువగా ఈ సీరియల్ కి రేటింగ్ వచ్చింది. ఐపీఎల్, బిగ్‌బాస్ లాంటివి ఉన్నా ‘కార్తీక దీపం’ సీరియల్ రేటింగ్ తగ్గలేదు. కొన్ని సంవత్సరాలుగా అత్యధిక టిఆర్పి మెయింటైన్ చేస్తూ వచ్చింది ఈ సీరియల్.

ఇక ఈ సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించిన కేరళ నటి ప్రేమి విశ్వనాథ్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. డాక్టర్ బాబు క్యారెక్టర్ చేసిన నిరుపమ్‌కి కూడా ఈ సీరియల్‌తో అభిమానులు పెరిగారు. అయితే ఇటీవల కాలంలో ఈ సీరియల్ రేటింగ్ కొద్దిగా తగ్గింది. సీరియల్ లో కథ అయిపోయినా కూడా ఇంకా సాగదీస్తున్నారు. దీంతో సీరియల్‌కి రేటింగ్ తగ్గడం మొదలైంది. సీరియల్ కి మళ్ళీ రేటింగ్ రావాలి అనో లేక సీరియల్ కి త్వరలోనే ముగింపు ఇవ్వాలనే ఓ కొత్త ఎపిసోడ్ ని చేశారు.

Akhanda : కొత్త సినిమా సెట్‌లో బాలయ్య ‘అఖండ’ వేడుక..

ఇటీవలి ఎపిసోడ్ లో డాక్టర్‌ బాబు, వంటలక్క పాత్రలను చంపేశారు. ఆ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు సీరియల్‌లో చూపించారు. దీంతో ఇకపై కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరు. ఇక డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్ కూడా తన సోషల్ మీడియాలో కార్తీక దీపం సీరియల్‌కి గుడ్‌బై చెప్పేసాను. ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. దీంతో వంటలక్క అభిమానులు, సీరియల్ అభిమానులు షాక్‌కి గురయ్యారు. మరి వీళ్లిద్దరు లేకుండా ఈ సీరియల్ ని ఎన్ని రోజులు నడిపిస్తారో చూడాలి. లేదా త్వరగానే ముగిస్తారేమో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా తెలుగులో గత కొన్ని సంవత్సరాలుగా సీరియల్స్‌లో రూలర్‌గా నిలిచినా ‘కార్తీక దీపం’ కథ ముగిసినట్టే.