Sabari Movie : వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ సినిమాకు దాసరి ఫిలిం అవార్డ్..

వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా గత సంవత్సరం మేలో ‘శబరి’ అనే సినిమా రిలీజయింది.

Sabari Movie : వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ సినిమాకు దాసరి ఫిలిం అవార్డ్..

Varalaxmi Sarathkumar Sabari Movie Gets Dasari Film Award

Updated On : May 2, 2025 / 5:24 PM IST

Sabari Movie : వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా గత సంవత్సరం మేలో ‘శబరి’ అనే సినిమా రిలీజయింది. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శబరి సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా sunNXT ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

తాజాగా ఈ సినిమా దాసరి ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ కథా చిత్రంగా అవార్డు సాధించింది. ఒక తల్లి తన కూతుర్ని కాపాడుకోవాలి, తన కూతురు కోసం చేసే పోరాటంతో ఈ సినిమా తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ప్రతి సంవత్సరం జరిగే దాసరి ఫిలిం అవార్డ్స్ తాజాగా జరగ్గా ఇందులో ఉత్తమ కథా చిత్రం అవార్డు అందుకుంది శబరి సినిమా.

Also Read : Kingdom Song : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..

ఈ అవార్డుని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల అనిల్ రావిపూడి, సాయి కుమార్, సుమన్, మురళి మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సినిమా నిర్మాతగా మహేంద్ర నాథ్ కూండ్లకు మొదటి సినిమా కావడం గమనార్హం. మొదటి సినిమాకు ఇలాంటి డిఫరెంట్ కథ, ఎమోషన్స్ ఉన్న సినిమా తీయడం గ్రేట్ అని అవార్డ్స్ కమిటీ ప్రశంసించింది.

Varalaxmi Sarathkumar Sabari Movie Gets Dasari Film Award

Also Read : Bullet Bhaskar – Mahesh Babu : ఆ సినిమాకు మహేష్ బాబుకు మొత్తం డబ్బింగ్ నేను చెప్పాను.. నా డబ్బింగ్ చూసి మహేష్ గారు ఏమన్నారంటే..?