Varudu Kaavalenu : దసరాకి ‘వరుడు కావలెను’..

లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న ‘వరుడు కావలెను’ దసరా కానుకగా విడుదల కానుంది..

Varudu Kaavalenu : దసరాకి ‘వరుడు కావలెను’..

Varudu Kaavalenu

Updated On : September 25, 2021 / 12:00 PM IST

Varudu Kaavalenu: యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘వరుడు కావలెను’..

Rana Daggubati : రానా రేంజ్ పెరిగింది.. అందుకే అన్ని కోట్లు..

అచ్చ తెలుగు టైటిల్ కావడంతో సినిమాపై ముందు నుండి మంచి అంచనాలున్నాయి. అలాగే ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘దిగు దిగు నాగ’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈమధ్య రిలీజ్ చేసిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఈ జెనరేషన్ యూత్ లైఫ్ స్టైల్‌కి దగ్గరగా ఉంది టీజర్. నాగ శౌర్య – రీతు వర్మ పెయిర్.. వారి కెమిస్ట్రీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది.

Varudu Kaavalenu : ‘ఆ అందం.. ఆ పొగరు.. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది’..

శనివారం ‘వరుడు కావలెను’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నదియా, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.