Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య పెట్టుకున్న 3 న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా? పర్లేదు బానే ఉన్నాయి..

తాజాగా నిన్న న్యూ ఇయర్ సందర్భంగా తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్(New Year Resolutions) ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది లావణ్య త్రిపాఠి.

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య పెట్టుకున్న 3 న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా? పర్లేదు బానే ఉన్నాయి..

Varun Tej Wife Actress Lavanya Tripathi New Year Resolutions

Updated On : January 2, 2024 / 9:28 AM IST

Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల కొన్ని నెలల క్రితం వరుణ్ తేజ్(Varun Tej) ని ప్రేమ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నుంచి నుంచి లావణ్య ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. వరుణ్ తో కలిసి ఇటీవలే హనీమూన్ ట్రిప్ కి ఫిన్ల్యాండ్ కూడా వెళ్ళొచ్చింది. ఇక క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని మెగా ఫ్యామిలీతో కలిసి చేసుకుంది. ప్రస్తుతం లావణ్య మెగా కోడలు అయ్యాక మరింత వైరల్ అవుతుంది.

తాజాగా నిన్న న్యూ ఇయర్ సందర్భంగా తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్(New Year Resolutions) ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది లావణ్య త్రిపాఠి. మనం అందరం న్యూ ఇయర్ కి ఏదో ఒక రిజల్యూషన్ పెట్టుకుంటాం. మరి లావణ్య పెట్టుకున్న 3 న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా?

#మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి (Be a Better Human Being)
#నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకోవాలి(Self Love)
#సోషల్ మీడియాకు తక్కువ టైం ఇచ్చి ప్రకృతితో ఎక్కువ టైం గడపాలి.(Spend Less Time on Social Media and More time in Nature)

Varun Tej Wife Actress Lavanya Tripathi New Year Resolutions

 

Also Read : Siddharth – Aditi : సిద్దార్థ్ , అదితి ఈ ఫొటోతో రిలేషన్‌షిప్ పై క్లారిటీ ఇచ్చారా?.. రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?

అంటూ ఈ మూడింటిని లావణ్య త్రిపాఠి తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గా పెట్టుకుంది. మరి వీటిని ఎంతవరకు పాటిస్తుందో చూడాలి. తను అనుకున్న దాని ప్రకారం లావణ్య ఇకపై సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తుంది అని తెలుస్తుంది. ప్రస్తుతానికి లావణ్య చేతిలో ఒక తమిళ్ సినిమా ఉంది.